రవితేజ మళ్లీ ఫామ్ లోకి వస్తున్నాడు..!
on May 18, 2016

మాస్ మహరాజాకు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులొచ్చాయి. అయితే ఆ సినిమాల ఫ్లాపులకంటే, వాటిలో రవి ఫిజిక్ ఆయన అభిమానులకు చాలా బాధను కలిగించింది. సిక్స్ ప్యాక్ కోసం, ఫిట్ నెస్ కోసమే అలా చేశాను తప్ప ఎవర్నీ ఇబ్బంది పెట్టాలని కాదు. ఇప్పుడు జనాలకు నచ్చలేదని తెలిసింది కాబట్టి మళ్లీ బరువు పెరుగుతాను అని ఒక ఇంటర్వ్యూలో స్వయంగా ఆయనే చెప్పాడు. తన పాత లుక్ లోకి వచ్చేసి మళ్లీ హిట్ల బాట పట్టాలనేది ఇప్పుడు రవితేజ టార్గెట్. ప్రస్తుతం రవి తన కొత్త లుక్ కోసమే బయట పెద్ద కనబడట్లేదని సినీజనాలంటున్నారు. ఇప్పటికే పదికేజీల బరువు పెరిగాడని, ఎప్పట్లాగే పూర్తి రఫ్ అండ్ టఫ్ మాస్ లుక్ లో కొత్త సినిమాలో కనిపించాలనుకుంటున్నాడని సమాచారం. ప్రస్తుతం మాస్ మహరాజ్ రాబిన్ హుడ్ అనే సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యేలోపు ఒళ్లు పెంచబోతున్నాడట. చక్రి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రవితేజతో రాశిఖన్నా రెండో సారి జతకడుతోంది. ఒళ్లు పెంచాక అయినా మాస్ రాజా హిట్టుకొడతాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



