ఆ కుర్రహీరో మొత్తం విప్పేస్తానంటున్నాడు..!
on May 18, 2016

ఎప్పుడూ హీరోయిన్లే అందాలు చూపించాలా..మేము కూడా సిక్స్ ప్యాక్ లు, కండలూ చూపిస్తాం అంటున్నారు బాలీవుడ్ హీరోలు. అందుకోసం నగ్నంగా నటించడానికి సైతం సై అంటున్నారు. గతంలో సావరియా సినిమాకు రణ్ బీర్ కపూర్, పీకేలో అమీర్ ఖాన్, జాన్ అబ్రహాం లు ఇలాంటి ప్రయోగాలు చేశారు. ఇప్పుడు బాలీవుడ్ హార్ట్ త్రోబ్ రణ్ వీర్ సింగ్ వంతొచ్చింది. ఇప్పటికే అక్కడ భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ కండల రావు, తన తాజా సినిమాలో మొత్తం విప్పేస్తానంటున్నాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాత ఆదిత్య చోప్రా డైరెక్ట్ చేస్తున్న బేఫికర్ సినిమాకోసం ఈ స్టంట్ చేస్తున్నాడు మనోడు.
ఇప్పటికే లిప్ లాక్స్ లో కూడా ఈ సినిమా రికార్డ్ సృష్టించబోతుందని టాక్ నడుస్తోంది. హీరోయిన్ వాణీ కపూర్ కు రణ్ వీర్ కు మధ్య దాదాపు 23 లిప్ లాక్స్ ఉన్నాయట. వాటిలో రెండింటిని రిలీజ్ చేసేశారు కూడా. ఆల్రెడీ ఫిమేల్ ఫాలోయింగ్ పొలోమని ఉన్న రణ్ వీర్, ఈ సినిమాతో క్రేజ్ లో మరింత హైట్స్ కు రీచ్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు మరో స్పెషాలిటీ ఆదిత్య చోప్రా. తన 20 ఏళ్ల డైరెక్షన్ కెరీర్లో దిల్ వాలే దుల్హానియా లేజాయేంగ్, మొహబ్బతే, రబ్ నే బనాదే జోడీ అనే మూడు సినిమాలు మాత్రమే డైరెక్ట్ చేసిన ఆదిత్యకు బేఫికర్ నాలుగో సినిమా. అందుకే ఈ సినిమాపై అంచనాలు కూడా బాలీవుడ్ లో భారీగానే ఉన్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



