'క్రేజీ అంకుల్స్'లో మనో
on Oct 16, 2020

ప్రముఖ గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ మనో బుల్లితెరపైకి వచ్చారు. ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ రియాలిటీ షో 'జబర్దస్త్'కి జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. అప్పుడప్పుడూ జడ్జ్ సీటు నుండి స్టేజి మీదకు కూడా వస్తున్నారు. స్కిట్లు చేస్తున్నారు. ఆయనలోని కామెడీ యాంగిల్, టైమింగ్ ను ఆ స్కిట్లు బయట పెడుతున్నాయి.
మనో కామెడీ టైమింగ్ ను ఫుల్ గా వాడుకోవాలని దర్శకుడు శివ నాగేశ్వరరావు నిర్ణయించుకున్నారు. గతంలో 'మనీ' వంటి కామెడీ ఎంటర్టైనర్ తీసిన ఆయన, ప్రస్తుతం ఓటీటీ కోసం 'క్రేజీ అంకుల్స్' అని ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో మనో, సంగీత రఘు కుంచె, రాజా రవీంద్ర ప్రధాన పాత్రలు పోషించనున్నారు. యాంకర్ శ్రీముఖి సైతం ప్రధాన పాత్రలో కనిపించనుంది. దసరాకి ఈ సినిమా ప్రారంభం కానుందని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



