సొంత బ్యానర్‌లో నాగశౌర్య నాలుగో సినిమా
on Oct 16, 2020

హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య, టాలెంటెడ్ డైరెక్టర్ అనీష్ కృష్ణ కాంబినేషన్‌లో ప్రొడక్షన్ నంబర్ 4గా ఒక రొమాంటిక్ కామెడీ ఫిల్మ్‌ను నిర్మించేందుకు ఐరా క్రియేషన్స్ సన్నాహాలు ప్రారంభించింది. శుక్రవారం సోషల్ మీడియాలో కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేయడం ద్వారా అఫిషియల్‌గా ఆ మూవీని ప్రకటించారు.
ఉష ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఆహ్లాదకరమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. డైరెక్టర్ అనీష్ కృష్ణకు ఇది మూడో సినిమా. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇదివరకు నాగశౌర్య సూపర్ హిట్ ఫిల్మ్ 'ఛలో'కు ఆయన బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ అందించారు. ఆ సినిమాలోని 'చూసీ చూడంగానే..' సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలుసు.
షూటింగ్‌కు సన్నాహాలు జరుగుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడి చేయనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



