లాక్‌డౌన్ తరవాత... తమిళ్‌లో విడుదల కానున్న తొలి సినిమా మహేష్‌దే!
on Oct 16, 2020

తమిళనాడులో సూపర్‌స్టార్ మహేష్ బాబు సరికొత్త రికార్డు సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ్ వెర్షన్ త్వరలో విడుదల కానుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే... లాక్‌డౌన్ తరవాత తమిళ్‌లో విడుదల కానున్న తొలి సినిమాగా రికార్డు సృష్టించనుంది.
తమిళనాడులో, ముఖ్యంగా చెన్నైలో మహేష్ బాబుకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ మహేష్ సినిమాలకు మంచి స్పందన లభిస్తుంది. తెలుగులో ప్లాప్ అయిన 'ఆగడు'ని తమిళంలో డబ్బింగ్ చేసి విడుదల చేస్తే మంచి వసూళ్లు వచ్చాయి. హిట్ అనిపించుకుంది. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తీసిన 'స్పైడర్'కి సైతం తమిళనాట చెప్పుకోదగ్గ స్పందన లభించింది. అందుకని, 'సరిలేరు నీకెవ్వరు'ను తమిళంలో డబ్బింగ్ చేశారు. లాక్‌డౌన్ తరవాత తమిళ్‌లో పూర్తి స్థాయిలో థియేటర్లు తెరచుకోగానే 'సరిలేరు...' తమిళ వెర్షన్ 'ఇవనుక్కు సరియానా ఆలిన్'ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



