సహజీవనంపై బోర్ కొట్టిందా.. పెళ్లికి రెడీ అంటోంది!
on Jan 28, 2023
మొన్న సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో ప్రేక్షకులకు ముందు వచ్చిన ముద్దుగుమ్మ శృతిహాసన్. విశ్వ నటుడు కమలహాసన్ గారాల పట్టి అయినా శృతిహాసన్ సీనియర్ స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా పేరు దక్కించుకుంది. ప్రస్తుతం ఈమె ప్రభాస్ తో సలార్ అనే పాన్ ఇండియా మూవీలో కూడా నటిస్తోంది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడు పలు చిత్రాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.
ఒక సూపర్ స్టార్ కూతురైన కూడా మొదటి నుండి ఒక సాధారణ హీరోయిన్ మాదిరిగానే సాగింది. తన తండ్రి స్టార్ డమ్ ని ఆమె ఏనాడు వాడుకోలేదు. ఎక్కడా తన అవకాశాల కోసం తండ్రిపేరును వాడుకున్న దాఖలాలు లేవు. ఎలాగోలా కష్టపడి ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. కానీ ప్రేమ, సహజీవనం అంటూ తన కెరీర్ ను తానే నాశనం చేసుకుంది. ఇక ఈమె ఏ పర్సనల్ విషయాన్ని కూడా దాచుకోదు. తన ప్రేమ, సహజీవనం వంటి విషయాలను పబ్లిక్ గానే చెబుతూ ఉంటుంది. ఇతర విషయాలను ఎప్పటికప్పుడు చెబుతూనే వస్తోంది. హీరోయిన్ గా సినిమాలు చేస్తునే శృతిహాసన్ కొన్నేళ్లుగా డూడుల్ ఆర్టిస్టు అయిన శాంతను హజారిక తో ప్రేమలో ఉన్న విషయం తెలిసింది. ఇద్దరూ సహజీవనం కూడా చేస్తున్నారు.
దీని గురించి శృతిహాసన్ పదే పదే పోస్టులు పెడుతోంది. శృతిహాసన్ సన్నిహితుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం శృతిహాసన్, శాంతాన్ హజారికాల వివాహానికి రెండు వైపులా కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దాంతో సాధ్యమైనంత త్వరగా పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయి. శృతిహాసన్ పెళ్లి తరువాత కూడా ఇండస్ట్రీలో కెరీర్ ను కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
