నాని హీరోయిన్ కమల్ ని వివాహమాడింది!
on Jan 27, 2023
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ హరిప్రియ బాగానే పరిచయం ఉంది. కన్నడ కు చెందిన ఈమె 2007లో తులు భాషలో నటించినది. ఆ తరువాత 2008లో కన్నడలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో తకిట తకిట, పిల్ల జమిందార్,అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా, గలాటా, జై సింహ వంటి చిత్రాలలో నటించింది. కాగా ఈమెకు మంచి పేరు తీసుకుని వచ్చిన చిత్రం నాని హీరోగా వచ్చిన పిల్ల జమిందార్ అని చెప్పాలి. ఈమె తాజాగా పెళ్లికూతురు అయ్యింది.
కన్నడ నటుడైన వశిష్ట సింహాను ఈమె వివాహం చేసుకుంది. వశిష్ట సింహా కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. వెంకటేష్ నటించిన నారప్ప చిత్రంతో పాటు నయీం డైరీస్, ఓదెల రైల్వే స్టేషన్ వంటి తెలుగు చిత్రాల్లో నటించిన ఈయనకు కేజీఎఫ్ చాప్టర్ 1 కేజీఎఫ్ చాప్టర్ 2 లలో నటించిన కమల్ పాత్ర ఎంతో పేరును తీసుకొని వచ్చింది. తాజాగా హరిప్రియ వశిష్టా సింహాలు వివాహం చేసుకున్నారు. శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో పౌండరీక రంగస్థల లో వివాహం చేసుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి సహచర నటీనటులు, కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వివాహం జరిగింది.
వీరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కొన్ని వారాల క్రితం నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అప్పట్లోనే ఈ జంట ఉంగరాలు మారుస్తున్న ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక తాజాగా హల్దీ వేడుకల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీటికి తోడు పెళ్లి ఫోటోలు కూడా నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. మొత్తానికి నాని హీరోయిన్ హరిప్రియ తన సహచర నటుడు కన్నడకే చెందిన వశిష్ట సింహాను వివాహం చేసుకోంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
