శర్వానంద్ కాబోయే శ్రీమతి ఎవరో తెలుసా!
on Jan 28, 2023
కోవిడ్ సమయంలో యంగ్ హీరోలైనా దగ్గుబాటి రానా, నిఖిల్, నితిన్ వంటి వారు వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన శర్వానంద్ ఎంగేజ్మెంట్ జరిగింది. త్వరలో ఆయనకు రక్షిత రెడ్డి తో వివాహం జరగనుంది. ఈ నిశ్చితార్థం హైదరాబాదులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు, ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహిత స్నేహితులు, బంధువుల మధ్య ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రామ్ చరణ్ తో పాటు ఉపాసన కూడా హాజరయ్యారు. ఇక శర్వానంద్ వివాహం చేసుకోబోతున్న రక్షిత రెడ్డి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అనేది ఆసక్తికరంగా మారింది. రక్షిత రెడ్డి గత కొంతకాలంగా యూఎస్ లో సాఫ్ట్ వేర్ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన సంబంధం.
రక్షిత రెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె. అంతే కాదు ఒకప్పటి ఏపీ మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలుగా తెలుస్తోంది. శర్వానంద్ రక్షిత రెడ్డిల ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో విడుదలయ్యాయి. అందరి మధ్య ఈ జంట ఎంగేజ్మెంట్ ఉంగరాలను మార్చుకున్నారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు శర్వానంద్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. త్వరలో పెళ్లిరోజును అధికారికంగా కుటుంబ సభ్యులు ప్రకటించనున్నారు. వేసవిలో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఒకే ఒక్క జీవితం మూవీతో ఇటీవల సక్సెస్ సొంతం చేసుకున్న శర్వానంద్ ఆ సక్సెస్ జోష్ లో కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
