నందమూరి బాబాయ్ - అబ్బాయ్ లతో..!
on Dec 25, 2021

క్రేజీ ప్రాజెక్ట్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ బేనర్ ముందు వరుసలో ఉంటుంది. అన్ని వర్గాల కథానాయకులతోనూ సినిమాలు చేస్తూ.. టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అవుతోంది ఈ పాపులర్ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్.
ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో నందమూరి బాబాయ్ - అబ్బాయ్ లతో ప్రాజెక్ట్స్ లాక్ చేసిన ఏకైక నిర్మాణ సంస్థగా మైత్రీ మూవీ మేకర్స్ వార్తల్లో నిలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.. `అఖండ` వంటి సంచలన విజయం తరువాత నటసింహం నందమూరి బాలకృష్ణ నటించబోతున్న కొత్త సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థనే నిర్మించనుంది. `క్రాక్` కెప్టెన్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించనున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ జనవరి ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళనుంది. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ తో రాజేంద్ర దర్శకత్వంలో ఓ సినిమాని నిర్మిస్తోంది మైత్రీ. అంతేకాదు.. `జనతా గ్యారేజ్` వంటి బ్లాక్ బస్టర్ తరువాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లోనూ ఓ సినిమాని ప్రొడ్యూస్ చేయబోతోంది. `కేజీఎఫ్` కెప్టెన్ ప్రశాంత్ నీల్ ఈ భారీ బడ్జెట్ మూవీని రూపొందించనున్నారు. మరి.. నందమూరి బాబాయ్ - అబ్బాయిలు బాలయ్య - తారక్, కళ్యాణ్ రామ్ తో మైత్రీ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎలాంటి ఫలితాన్ని పొందుతాయో చూడాలి.
కాగా, ఏడాది నుండి ఏడాదిన్నర గ్యాప్ లో ఈ మూడు ప్రాజెక్ట్స్ తెరపైకి వచ్చే అవకాశముందని టాక్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



