బర్త్ డే స్పెషల్ః ఐదేళ్ళు `హిట్స్`తో హవా చాటిన శ్రుతి!
on Jan 28, 2022

(జనవరి 28 శ్రుతి హాసన్ పుట్టినరోజు సందర్భంగా..)
`లోక నాయకుడు కమల్ హాసన్ తనయ` అనే ట్యాగ్ తో తెరంగేట్రం చేసిన అందాల తార శ్రుతి హాసన్.. తండ్రి తరహాలోనే విభిన్న భాషల్లో నటిగా తన ప్రతిభను చాటుకుంది. తెలుగు, తమిళ, హిందీ.. ఇలా మూడు భాషల్లో కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రుతి హాసన్, టాలీవుడ్ లోనే మంచి సక్సెస్ లు చూసింది. అంతేకాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .. ఇలా మెగా కాంపౌండ్ హీరోలకు అచ్చొచ్చిన కథానాయికగా ప్రత్యేక గుర్తింపు పొందింది.
ఇదిలా ఉంటే.. కెరీర్ ఆరంభంలో `ఐరెన్ లెగ్` ఇమేజ్ మూటగట్టుకున్న శ్రుతి.. పవన్ తో తొలిసారిగా జతకట్టిన `గబ్బర్ సింగ్`తో ఫస్ట్ బ్లాక్ బస్టర్ చూసింది. అది మొదలుకుని ఐదేళ్ళ పాటు ప్రతీ ఏడాదిలోనూ ఒక్క విజయమైనా ఇక్కడ చూస్తూ క్రమంగా `గోల్డెన్ లెగ్`గా వార్తల్లో నిలిచింది. 2012లో `గబ్బర్ సింగ్`, 2013లో `బలుపు`, 2014లో `ఎవడు`, `రేసు గుర్రం`, 2015లో `శ్రీమంతుడు`, 2016లో `ప్రేమమ్`.. ఇలా అర్ధదశాబ్దం పాటు సంవత్సరానికి ఒకటి లేదా అంతకుమించి హిట్స్ తో తన హవా చాటుకుంది శ్రుతి హాసన్. స్టార్ హీరోలకు కలిసొచ్చే కథానాయికగా స్పెషల్ ఇమేజ్ పొందింది.
ఇక గత ఏడాది `క్రాక్`, `వకీల్ సాబ్`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసిన శ్రుతి.. రాబోయే `సలార్`, `ఎన్బీకే 107`, `మెగా 154`తోనూ విజయపరంపరని కొనసాగించాలని ఆకాంక్షిద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



