ENGLISH | TELUGU  

సినిమా వివాదం.. గౌడ్ కమ్యూనిటీకి క్షమాపణలు!

on Jan 28, 2022

ప్రముఖ సింగర్ సునీత భర్త రామ్ వీరపనేనికి ఆధ్వర్యంలో నడుస్తున్న మ్యాంగో సంస్థకి చెందిన ఓ యూట్యూబ్ ఛానల్ పై ఇటీవల వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. ఆ యూట్యూబ్ ఛానల్ లో ప్రసారమవుతున్న ఓ సినిమాలో గౌడ సామాజికవర్గానికి చెందిన మహిళలను కించపరిచేలా సీన్స్ ఉండటంతో.. ఆ కుల సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆఫీస్ పై దాడికి యత్నించారు. ఆ సన్నివేశాలను వెంటనే డిలీట్ చేసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే తాజాగా ఈ వివాదంపై వివరణ ఇస్తూ సదరు సంస్థ ప్రెస్ నోట్ విడుదల చేసింది.

"సోమవారం, 24 జనవరి 2022 నాడు, కొంతమంది వ్యక్తులు తాము గౌడ్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళమని, ఒక సినిమా లోని వీడియో క్లిప్ గురించి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గౌడ్ మహిళలను కించపరిచే విధంగా చిత్రీకరిస్తున్నారని వాదిస్తూ, పేర్కొన్న కంటెంట్ యూట్యూబ్ నుండి తొలగించాలని కోరారు. పేర్కొన్న ఫిల్మ్ అప్పటికే సెన్సార్ చేయబడి, సెన్సార్ సర్టిఫికేట్ తో పాటు యూట్యూబ్ లో అందుబాటులోకి వచ్చినప్పటికీ, స్త్రీలను కించపరుస్తూ చూపే ఎటువంటి సన్నివేశాలను చూపడం ఎన్నడూ మా ఉద్దేశం కాకపోవడం మరియు మా సిద్ధాంతాలకు వ్యతిరేకం కావడం వల్ల మేము వెంటనే 24.01.2022 న వీడియోను తొలగించాము. మహిళలందరి పట్ల మాకు అత్యంత గౌరవం ఉందని తెలియజేస్తూ మేము ఇప్పటికే తీసివేసిన ఆ వీడియో వల్ల పొరపాటున ఎవరైనా మహిళ లేదా గౌడ్ కమ్యూనిటీకి చెందిన ఏ వ్యక్తి యొక్క మనోభావాలనైనా పొరపాటున నొప్పించి ఉంటే, మేము బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నాము." అంటూ నోట్ విడుదల చేశారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.