థియేటర్‌లో సినిమా చూడ్డానికి ఆటోలో వచ్చిన శ్రియ!
on Dec 10, 2021

సౌత్ స్టార్‌లు సింప్లిసిటీకి ఎందుకు పేరుపొందారనేందుకు మరొక బలమైన రుజువు, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ శ్రియా శరణ్ ఇతర సినీ ప్రేక్షకులతో కలిసి తన లేటెస్ట్ ఫిల్మ్ 'గమనం' చూడ్డానికి ఆటో రిక్షాలో థియేటర్‌కు రావడం. ఆమె ఈ చర్య కచ్చితంగా అభిమానులను ఆశ్చర్యపరిచింది. 'గమనం' మూవీని చూడ్డానికి ఆమె హైదరాబాద్, హైదర్ నగర్‌లో ఉన్న మల్లికార్జున్ థియేటర్‌కు మ్యాట్నీ షో చూసేందుకు ఆటోలో వచ్చింది.
Also read: 'లక్ష్య' మూవీ రివ్యూ
ఆమె ఆటోలో రావడం గమనించిన ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. ఆమెకు దగ్గరగా రావడానికి పోటీపడ్డారు. నార్త్ సినిమా అభిమానుల్లా కాకుండా సౌత్ సినిమా అభిమానులు తమ అభిమాన తారలందరిపై తమ ప్రేమనీ, అభిమానాన్నీ చాలా గొప్పగా ప్రదర్శిస్తుంటారు. అందుకే అభిమానుల్ని ఇంప్రెస్ చేయడానికి తారలు కూడా రకరకాల పద్ధతుల్లో వారిని అనుసరిస్తుంటారు.

శ్రియ కీలక పాత్ర పోషించిన 'గమనం' సినిమా ద్వారా సుజనా రావు దర్శకురాలిగా పరిచయమైంది. శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, సుహాస్, నిత్యా మీనన్, చారు హాసన్, బిత్తిరి సత్తి, రవిప్రకాశ్ తదితరులు నటించిన ఈ మూవీని రమేశ్ కరుటూరి, వెంకి పూషాడపు, జ్ఞానశేఖర్ వి.ఎస్. నిర్మించారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఇది విడుదలైంది. విమర్శకులు తిప్పికొట్టిన ఈ సినిమాకి ఓపెనింగ్స్ తీసికట్టుగా ఉన్నాయి.
Also read: పులిలా గాండ్రించిన భీమ్.. అగ్నిలా ప్రజ్వరిల్లిన రామ్!
జనవరి 7న విడుదల కానున్న యస్.యస్. రాజమౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్'లో అజయ్ దేవ్‌గణ్ భార్యగా శ్రియ కనిపించనున్నది. ఇదివరకు ప్రభాస్ జోడీగా నటించిన హిట్ ఫిల్మ్ 'ఛత్రపతి' తర్వాత రాజమౌళి డైరెక్షన్‌లో ఆమె నటించిన సినిమా ఇదే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



