'గెలయా గెలయా' పాట పాడి పునీత్‌కు నివాళి అర్పించిన తారక్!
on Dec 10, 2021

కన్నడ పవర్‌ప్టార్ పునీత్ రాజ్‌కుమార్ లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిది. కేవలం కన్నడ చిత్రసీమే కాకుండా యావత్ దక్షిణాది చిత్రసీమ పునీత్ మరణంతో విలవిల్లాడిపోయింది. బెంగళూరులో ఈరోజు జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పునీత్‌కు "గెలయా గెలయా" పాట పాడి నివాళులర్పించాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ పాటను తను పాడటం ఇదే చివరిసారని ఆయన చెప్పాడు.
పునీత్ హీరోగా నటించిన 'చక్రవ్యూహ' (2016) సినిమాలో "గెలయా గెలయా" పాటను ఆలపించింది స్వయంగా జూనియర్ ఎన్టీఆరే. తమన్ స్వరాలు కూర్చిన ఈ పాట ఐదేళ్ల క్రితం పునీత్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. ఇప్పుడు ఆ పాటను ఆలపించిన తారక్, "ఇది నా మొదటిది, చివరిది కూడా" అని చెప్పాడు. "ఆయనెక్కడ ఉన్నా, తన ఆశీస్సులు ఎప్పుడూ మనమీద ఉంటాయి" అని అన్నాడు తారక్. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో యస్.యస్. రాజమౌళి, రామ్‌చరణ్, ఆలియా భట్ కూడా పాల్గొన్నారు.
అక్టోబర్ 19న తీవ్ర గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశాడు పునీత్. ఆయన వయసు 46 సంవత్సరాలు. వార్త తెలిసిన వెంటనే టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు హుటాహుటిన బెంగళూరుకు వెళ్లి పునీత్‌ను కడసారి దర్శించుకొని, ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకొని విలపించారు. ఆయన అంత్యక్రియలకు 10 లక్షలకు పైగా అభిమానులు హాజరయ్యారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



