Home

»

Latest News

పులిలా గాండ్రించిన భీమ్‌.. అగ్నిలా ప్ర‌జ్వ‌రిల్లిన రామ్‌!

Dec 9, 2021 4:33PM

 

తెలుగోడి ఛాతీ ఉప్పొంగేలా 'ఆర్ఆర్ఆర్' ట్రైల‌ర్ వ‌చ్చేసింది. దాన్ని చూసి దేశ‌వ్యాప్తంగానే కాకుండా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినీ ప్రియుల్లో అంచ‌నాలు అమోఘంగా పెరిగిపోయాయి. ప‌లు విదేశీ సినీ విమ‌ర్శ‌కులు సైతం త‌మ యూట్యూబ్ చాన‌ళ్ల‌లో 'ఆర్ఆర్ఆర్' ట్రైల‌ర్‌ను స‌మీక్షిస్తూ, ప్ర‌శంస‌ల వ‌ర్షంలో దాన్ని ముంచెత్తారు. జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి తీర్చిదిద్దిన ఈ మూవీలో ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ్‌గ‌ణ్ లాంటి బాలీవుడ్ టాప్ యాక్ట‌ర్లు కూడా న‌టించారు.

ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్‌, రామ‌రాజు, భీమ్ క్యారెక్ట‌ర్ టీజ‌ర్స్‌, సాంగ్స్ ఈ మూవీపై అంచ‌నాల‌ను అంత‌కంత‌కూ పెంచుతూ రాగా, ఇప్పుడొచ్చిన ట్రైల‌ర్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్యూరియాసిటీని పెంచేసింది. ఆర్ఆర్ఆర్ ఇప్పుడు కేవ‌లం మ‌న దేశానికే ప‌రిమిత‌మైన సినిమా కాద‌నీ, గ్లోబ‌ల్ అంతా దానికోసం ఎదురుచూస్తోంద‌నీ చెప్ప‌డానికి సందేహించాల్సిన ప‌నిలేదు. Also read:  'ఆర్ఆర్ఆర్' ట్రైల‌ర్.. సీత‌ను పొట్ట‌లో త‌న్నిన బ్రిటీష్ ఆఫీస‌ర్‌!

ట్రైల‌ర్‌లో ఏ షాట్‌నూ త‌క్కువ చేయ‌డానికి వీల్లేద‌న్న‌ట్లు క‌నిపించింది కానీ.. రెండు షాట్లు మ‌రింత అద్భుతం అన్న‌ట్లు ఉన్నాయ‌నే అభిప్రాయం సోష‌ల్ మీడియాలో విరివిగా క‌నిపిస్తోంది. వాటిలో ఒక‌టి.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌, పెద్ద‌పులి ముఖాల క్లోజ‌ప్ షాట్. ముందు పెద్ద‌పులి నోరు తెర‌చి భీక‌రంగా గాండ్రిస్తే, ఆ వెంట‌నే తార‌క్ కూడా నోరు తెర‌చి పులిలా గాండ్రించే షాట్ అద‌ర‌హో అనిపించింది. ఆ షాట్‌కు ఒక ట్విట్ట‌ర్ యూజ‌ర్, "ఒకే ఫ్రేమ్‌లో రెండు పులులు. నిజ‌మైన‌దేదో క‌న్‌ఫ్యూజ్ కావ‌ద్దు" అని క్యాప్ష‌న్ పెట్టాడు. Also read:  'ఆర్ఆర్ఆర్' ట్రైలర్.. 'పులి'ని పట్టుకోవాలంటే 'వేటగాడు' కావాలి!

రెండోది.. పోలీస్ డ్ర‌స్‌ను విడిచి, కాషాయ దుస్తులు ధ‌రించి, రామ‌రాజు కాస్తా అల్లూరి సీతారామ‌రాజుగా మారి, ప్ర‌జ్వ‌రిల్లుతున్న అగ్ని మ‌ధ్య‌లోంచి వింటిని సారించి, బాణం వ‌దులుతున్న రామ్‌చ‌ర‌ణ్ ఇంటెన్స్ లుక్‌. ఇది ట్రైల‌ర్‌కే హైలైట్ అన్న‌ట్లుగా క‌నిపించింది. ఈ రెండు షాట్లు చూస్తుంటే ఒళ్లు గ‌గుర్పాటు క‌లిగింది. వీటిని చూస్తుంటే రాజ‌మౌళిలోని క్రియేటివ్ జీనియ‌స్‌కు సెల్యూట్ చేయాల‌నిపిస్తోంద‌ని ప‌లువురు యూజ‌ర్స్ అభిప్రాయ‌ప‌డ్డారు. Also read:  ఊపిరి బిగ‌ప‌ట్టించే, ఒళ్లు జ‌ల‌ద‌రింప‌జేసే సీన్ల‌తో 'ఆర్ఆర్ఆర్' ట్రైల‌ర్‌

చివ‌ర ఇద్ద‌రు హీరోలు క‌లిసి చేసే యాక్ష‌న్ సీక్వెన్స్ స్పెక్టాక్యుల‌ర్‌గా ఉంది. 3 నిమిషాల 7 సెక‌న్ల నిడివి వున్న 'ఆర్ఆర్ఆర్' ట్రైల‌ర్ చూశాక‌, ఒక విజువ‌ల్ వండ‌ర్‌తో పాటు, రోమాలు నిక్క‌బొడిచేలా చేసే ఇద్ద‌రు హీరోల ఎమోష‌న‌ల్ జ‌ర్నీని కూడా మ‌నం చూడ‌బోతున్నామ‌ని అర్థ‌మ‌వుతోంది. జ‌న‌వ‌రి 7 త‌ర్వాత ప్ర‌పంచ‌మంతా రాజ‌మౌళి నామ‌జ‌పంతో మారుమోగ‌క త‌ప్ప‌దు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com