ఆహాలో 'షికారు' వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ ఎప్పుడంటే...
on Jul 13, 2022

సాయిధన్సిక (కబాలి ఫేమ్) హీరోయిన్‌గా నటించిన 'షికారు' చిత్రం జూలై 1న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన పొందింది. తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, కె.వి. ధీరజ్, నవకాంత్, చమ్మక్ చంద్ర ప్రధాన పాత్రధారులైన ఈ మూవీని హరి కొలగాని దర్శకత్వంలో శ్రీసాయి లక్ష్మీ క్రియేషన్స్ బేనర్ మీద పి.ఎస్.ఆర్. కుమార్ నిర్మించారు. థియేటర్లలో విడుదలైన మూడు వారాల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.
తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో 'షికారు' జూలై 22న వరల్డ్ డిజిటర్ ప్రీమియర్‌గా విడుదలవుతోంది. 'యాన్ అన్‌లిమిటెడ్ ఫన్ రైడ్' అనేది ఈ మూవీ ట్యాగ్‌లైన్. శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు యూత్‌లో మంచి ఆదరణ పొందాయి. ఈ సినిమాలో పనిచేసిన అనుభవం గురించి సాయిధన్సిక మాట్లాడుతూ, "మొదట తమిళ అమ్మాయికి తెలుగువారి సపోర్ట్ ఎలా వుంటుందనే సందేహం వుండేది. కానీ ఇక్కడకు వచ్చాక అది పోయింది. దర్శకుడు నాకు అందమైన పాత్ర ఇచ్చారు. ఆయనకు సినిమాపై మంచి క్లారిటీ వుంది. ప్రచారంలో భాగంగా వైజాగ్ నుంచి నెల్లూరు వరకు రోడ్ ట్రిప్‌లో ఎంతో సంతోషం కలిగింది. శేఖర్ చంద్ర బాణీలు బాగా పాపులర్ అయ్యాయి. 'ఫ్రెండ్ తోడు వుండగా' పాట కాలేజీలో యూత్‌కు బాగా చేరింది." అని చెప్పుకొచ్చింది.
నటుడు రచ్చ రవి మాట్లాడుతూ, "నిర్మాత బాబ్జీగారు 650 సినిమాలు పంపిణీదారుడిగా చేసిన అనుభవంతో ఈ సినిమా తీశారు. ఈ కథలో నలుగురు హీరోలు మంచి పాత్రల్లో నటించారు. 'కబాలీ'లో రజనీకాంత్ కూతురుగా చేసిన సాయిధన్సిక చేయడంతోనే సగం సక్సెస్ వచ్చేసింది. కథగా చెప్పాలంటే ఓ తుంటరి కథ. యూత్ ఎడాప్ట్ చేసుకుంటారు. వైజాగ్ నుంచి నెల్లూరు వరకు జరిగిన యాత్రలో యూత్ ఎంతో రిసీవ్ చేసుకున్నారు." అన్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



