మెగా మేనల్లుడి రాకకు ముహూర్తం కుదిరింది
on Jul 13, 2022

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న మూడో సినిమా 'రంగరంగ వైభవంగా' జులై 1న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం కొత్త విడుదల తేదీని ప్రకటించారు.
వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా గిరీశయ్య దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ 'రంగరంగ వైభవంగా'. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ క్లాసిక్ హిట్ 'ఖుషి'ని గుర్తుచేసేలా ఉన్న టీజర్ సినిమాపై ఆసక్తి కలిగేలా చేసింది. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2న విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

మొదటి సినిమా 'ఉప్పెన'తో సంచలన విజయాన్ని అందుకున్న వైష్ణవ్.. రెండో సినిమా 'కొండపొలం'తో నిరాశపరిచాడు. ఇప్పుడు 'రంగరంగ వైభవంగా'తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. ఇక 'రొమాంటిక్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ కేతిక రిజల్ట్ తో సంబంధం లేకుండా యూత్ లో క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా హిట్ అయితే ఆమె ఊపందుకునే అవకాశముంది.
ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా శాందత్ సాయినుద్దీన్, ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరరావు వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



