చిరంజీవి 150వ సినిమా పేరు మారనుందా..!
on Aug 21, 2016

ఎన్నో సస్పెన్స్ ల మధ్య ఎట్టకేలకు చిరంజీవి 150వ సినిమా షూటింగ్ ప్రారంభమై శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఇప్పుడు సినిమా పేరు మార్పుపై పలు వార్తలు వినిపిస్తున్నాయి. కత్తి సినిమా రిమేక్ కాబట్టి ఈ సినిమాకు కత్తిలాంటోడు అన్న టైటిల్ పెడదామని ముందు అనుకున్నారు. కానీ ఈ సినిమా పేరు మార్చాలని అనుకుంటున్నారుట. చిరంజీవి నటింటిన ఖైదీ, ఖైదీనంబర్ 786 సక్సెస్ కావడంతో ఈ సినిమాకు ఖైదీ నంబర్ 150 అనే టైటిల్‌ని పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ ఈ సినిమాకు ఖైదీ నంబర్ 150 అని టైటిల్ పెడితే బాగుంటుందని రామ్‌చరణ్ భావించే ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు కానీ.. ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా సినిమా పేరు అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు. అంతేకాదు ఆదే రోజు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



