అభిమానులపై కన్నెర్ర చేసిన షారుఖ్..
on Sep 21, 2016

భారత్‌లో సినిమా ఒక మతం..అభిమాన తారలకు గుడి కట్టి పూజించేంత పిచ్చి మనోళ్లది. జీవితంలో ఒక్కసారైనా అభిమాన
నటుడిని/నటిని చూడాలని ఆశపడని వారుండరు. అలాంటిది ఆ నటుడు ఎదురుగా కనిపిస్తే ఇంకేమైనా ఉందా..? ఎగిరిగంతేస్తారు. అయితే కొంతమంది అభిమానులు మాత్రం తారల్ని తాకాలని కోరుకోవడమే చిక్కుల్ని తెస్తోంది. తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఆయన తాజా చిత్రం "ద రింగ్" షూటింగ్ కోసం ఆమ్‌స్టర్‌డామ్ వెళ్లాడు. ఆమ్‌స్టర్‌డామ్‌లోనూ షారుఖ్‌కు వీరాభిమానులున్నారు.
.jpg)
షూటింగ్ స్పాట్ వద్ద షారుఖ్ కారు నుంచి దిగగానే భారీ సంఖ్యలో అభిమానులు అతడిని చుట్టుముట్టేశారు. సెక్యూరిటీ మధ్య వారందరినీ దాటుకుంటూ వెళ్తోన్న షారుఖ్‌ని ఓ అభిమాని మెడ మీదుగా చేయివేసి పట్టుకోబోయాడు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన కింగ్‌ఖాన్ అతనిని గట్టిగా తోసేశారు. ఒక సందర్భంలో షారుఖ్ అతనిపై చేయిచేసుకునేదాకా వెళ్లాడు. బాడీగార్డులు సకాలంలో స్పందించి పరిస్థితిని అదుపుచేశారు. కాసేపు అభిమానులతో సెల్ఫీలు దిగిన బాద్‌షా అనంతరం షూటింగ్‌కు వెళ్లిపోయాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



