"రాగం"తో నటిగా సునీత
on Sep 21, 2016

గాయనిగా, డబ్బింగ్ కళాకారిణిగా, యాంకర్‌గా తెలుగు వారికి సుపరిచితురాలు సునీతా ఉపద్రష్ట. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందం..హావభావాలు పలికే సోయగం ఉండటంతో సునీతను తమ సినిమాల్లో నటింపజేయడానికి కొంతమంది దర్శక నిర్మాతలు ప్రయత్నించారు. అయితే ఆ అవకాశాలను ఆమె సున్నితంగా తిరస్కరించారు. అలాంటి సునీత ఇప్పుడు నటిగా మారారు. అయితే సినిమాల్లో కాదు, షార్ట్ ఫిలిమ్‌లో.. "రాగం" పేరుతో తెరకెక్కుతున్న షార్ట్ ఫిలింలో సునీత నటిగా పరిచయం కాబోతున్నారు. దీనిలో కథ, కథనాలు, పాత్రలు సమాజాన్ని ఆలోచింపచేసే విధంగా ఉంటాయట. ఇప్పటి వరకు గాయనిగా సత్తా చాటిన సునీత..ఈ షార్ట్ ఫిలింలో అద్భుతంగా నటించిందట.

మొదటిసారి నటిస్తున్న ఫిలింగ్ ఏమాత్రం లేకుండా చాలా సహజంగా హావభావాలు పలికించారట. దీంతో ఆమె నటన ఎలా ఉందో చూడాలని సునీత అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ షార్ట్‌ఫిలిం ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ దశలో ఉంది. అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సునీతతో పాటు సమీర్, సాయికిరణ్, సన ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. లేడి డైరెక్టర్ చైతన్య శ్రీ పెరంబదూర్ ఈ షార్ట్ ఫిల్మ్‌కి దర్శకత్వం వహిస్తుండగా, రోలింగ్ రీల్స్, రేణుకా టాకీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. తెలుగువన్.కామ్ మీడియా పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది.
.jpg)

.jpg)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



