దాసరి నోట.. చైతూ ప్రేమ మాట
on Sep 21, 2016

నిన్న హైదరాబాద్‌లో జరిగిన ప్రేమమ్ ఆడియో ఫంక్షన్ లో దాసరి నారాయణ రావు స్పీచే హైలెట్ అనిచెప్పుకోవాలి. ఎందుకంటే.. ఆయన నోటి నుంచి చైతూ ప్రేమాయాణం మరోసారి బయట పడిపోయింది. నాగచైతన్య - సమంత ప్రేమలో ఉన్నట్టు.. వాళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిసిందే. అయితే ఈ విషయాన్ని అభిమానుల సమక్షంలో నాగ్, చైతూలు ఎప్పుడూ బయటపడలేదు. ప్రేమమ్ ఆడియో ఫంక్షన్‌లో ఈ ప్రేమ కబురు అభిమానులకు అందరిస్తారనుకొన్నారంతా.
అయితే.. వాళ్ల నోటి నుంచి ఈ మాటలేం రాలేదు. చిత్రంగా దాసరి నారాయణ రావు నాగచైతన్య ప్రేమ గురించి మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు.చైతూ నవ్వులతోనే మాయ చేస్తాడని, అలా మాయచేసే ఆ హీరోయిన్‌ని పడేశాడని చమత్కరించారు దాసరి. ఆ హీరోయిన్ కూడా ఏం మాయ చేశావెతో మాయ చేసిందని ఓ హింటు ఇచ్చారు కూడా. దాంతో ఆడిటోరియం మొత్తం ఘొల్లుమంది. ఈ ఆడియో ఫంక్షన్‌కి సమంత కూడా వస్తుందేమో అని అంతా ఎదురుచూశారు. కానీ సమ్మూ రాకపోవడం, నాగ్ తొందర తొందరగా స్పీచ్ ముగించుకొని వెళ్లిపోవడం కాస్త నిరాశకు గురి చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



