చలపతిరావు గారి వల్లే ఆ బాధ నుంచి బయటకి వచ్చాను!
on Dec 25, 2022

సీనియర్ నటి కవిత ఇంట్లో కరోనా తీరని శోకాన్ని మిగిల్చింది. కరోనా కారణంగా ఆమె కొడుకు సంజయ్ రూప్, ఆమె భర్త దశరథ రాజ్ గత ఏడాది మరణించిన విషయం తెలిసిందే. ఐతే ఆమె ఏడాదిన్నరగా అసలు బయటికి రావడమే మానేశారు. ఒక రెండు నెలల నుంచి మాత్రమే ఆమె మళ్ళీ కొంచెం కొంచెంగా మామూలు మనిషిగా అవడానికి ట్రై చేస్తున్నారు.
కవిత 'ఓ మజ్ను' అనే మూవీతో 11 ఏళ్లకే వెండితెర అరంగ్రేటం చేసింది. సుమార్ 50కి పైగా తమిళ చిత్రాల్లో మెరిసిన ఆమె తెలుగు, మలయాళ, కన్నడ సినిమాల్లోనూ నటించింది. హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేస్తూ తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది. మరి అలాంటి కవిత రీసెంట్ గా ఇంటర్వ్యూలో తన బాధను షేర్ చేసుకున్నారు.
"సినీ ఇండస్ట్రీలో ఎవరు సెన్సిటివ్ గా ఉంటారో లేదో తెలీదు కానీ నేను చాలా సెన్సిటివ్..మా అమ్మ చనిపోయినప్పుడు 2007 లో నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ బెడ్ రిడెన్ అయ్యాను. ఈ విషయం ఎవరికీ తెలీదు. ఆ టైంలో చలపతిరావు గారు, గిరి బాబు గారు వచ్చి నాకు బాగా కౌన్సిలింగ్ ఇచ్చారు. మీ అమ్మ పిల్లలికి ఏం చేశారో నువ్వు కూడా మీ పిల్లలికి అన్ని రకాల బాధ్యతలు నిర్వహించాలి అని చెప్పి నన్ను ఆ బాధ నుంచి బయటికి తీసుకొచ్చారు. ఇక అదే టైంలో నాకు టీడీపీ నుంచి పిలుపొచ్చింది. అలా బిజీ అయ్యాను. మేమంతా పాత సినిమా డైరెక్టర్స్ ఇంటికి ఎలాంటి సంకోచం లేకుండా వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరూ నాకు తెలీదు.. నాకు 365 రోజులు షూటింగ్ కావాలి. పని ఉండాలి. చెప్పాలంటే ఇలాంటి పరిస్థితి రాకూడదు..వాళ్ళను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇలాంటి టైంలో ఉన్నప్పుడు గుడ్ ఫ్రెండ్స్, గుడ్ వర్క్ ఉంటే చాలు. నా భర్త, బిడ్డా ఇద్దరు చాలా మంచి వాళ్ళు. బంగారంలో అన్నా కల్తీ ఉంటుంది కానీ వాళ్ళల్లో కల్తీ ఉండదు. నేను రీసెంట్ గా ఒక తమిళ్ మూవీకి సైన్ చేసాను. మంచి క్యారెక్టర్ వచ్చింది. ఆల్రెడీ నేను ఇప్పుడు ఒక తమిళ్ సీరియల్ లో నటిస్తున్నాను. ఇక ఇప్పుడు మూవీ ఛాన్స్ కూడా వచ్చింది. ఎప్పుడూ మనల్ని మనం బిజీ చేసుకోవాలి. " అని కన్నీటి పర్యంతమవుతూ చెప్పారు సినీ నటి కవిత.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



