ఇంతకీ విడాకుల తర్వాత సమంత పరిస్థితి ఏమిటి?
on Dec 25, 2022

దక్షిణాది టాలెంటెడ్ హీరోయిన్ సమంత. వెండితెరపై సుమారు 12 ఏళ్లుగా నిరాటంకంగా అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఏకచిత్రాధిపత్యం చేస్తోంది. మొదటి సినిమా 'ఏ మాయ చేసావే' నుండి 'యశోద' వరకు ఆమె కెరీర్ నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సమంత సోలోగా ఎదిగింది. ప్రతిభకు తోడు అదృష్టం కలిసి రావడంతో సమంతాను ఆపడం ఎవరి తరం కాలేదు. ఇప్పుడున్న హీరోయిన్లతో పోలిస్తే సమంత సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. ఆమె లక్కీ హీరోయిన్ అనే ట్యాగ్‌ను సైతం సొంతం చేసుకుంది. టాలీవుడ్, కోలీవుడ్ టాప్ స్టార్స్ తో కలిసిన నటించింది. అంతేకాదు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా సూపర్ హిట్స్ నమోదు చేసింది.
ఇంక ఈమె తన మొదటి చిత్రం హీరో అక్కినేని ఫ్యామిలీకి చెందిన నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్యను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ విడాకులు ఇచ్చే వరకు పరిస్థితులు వచ్చాయి. భారతీయ సినీ చరిత్రలో అక్కినేని కుటుంబానికి అంటూ ప్రత్యేకత ఉంది. క్రేజ్ పరంగానే కాదు.... ఆర్థికంగా కూడా అక్కినేని కుటుంబం ఎంతో ఉన్నత స్థాయికి చెందినది. కానీ అక్కినేని ఫ్యామిలీతో పోలిస్తే సమంత ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి చాలా సాధారణమని చెప్పాలి. అయితే నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత కూడా నాగచైతన్య తో పోలిస్తే సమంతాకు సినిమాలలో ఎక్కువ క్రేజ్ ఉండేది. నాగచైతన్య జయపజయాలను ఎదుర్కొంటూ ఇంకా ఒక ఉన్నత స్థాయికి చేరుకుంటున్న క్రమంలోనే సమంత టాప్ హీరోయిన్‌గా రాణించింది. పెద్ద పెద్ద స్టార్ హీరోలతో కూడా కలిసి నటించింది. ఈ విషయాన్ని నాగచైతన్యనే ఒకసారి ఒప్పుకున్నాడు. నాకంటే కెరీర్ పరంగా సమంత సూపర్ అని కామెంట్ చేశాడు. కానీ వాళ్ళిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు.
దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ లో ఒకరైన సమంత ఆస్తులు విలువ విడాకుల తర్వాత ఎంత? ఇన్నేళ్ల కెరీర్లో ఆమె సంపాదించుని కూడ పెట్టుకున్నది ఏమిటి? అనే ఆత్రుత చాలా మందిలో ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సమంతా ఆస్తులు చిట్టా బాగానే ఉంది. సమంతకు హైదరాబాదులో లగ్జరీ అపార్ట్మెంట్స్ సముదాయంలో ఖరీదైన పెంట్ హౌస్ ఉంది. దీని విలువ రెండు కోట్లకు పై మాటే. ఇక స్నేహితులతో కలిసి కూడా సమంత కొన్ని వ్యాపారాలు చేస్తోంది. సాకీ అనే ఫ్యాషన్ బ్రాండ్ ను ఆమె రన్ చేస్తోంది. ఇంస్టాగ్రామ్ ప్రమోషన్స్ ద్వారా ఒక పెయిడ్ పోస్ట్ కి సమంత 10 నుంచి 20 లక్షలు వసూలు చేస్తుందట. ఇక సినిమాల పరంగా తీసుకుంటే సమంతా సినిమాకు నాలుగైదు కోట్లు తీసుకునే డిమాండ్ ఉంది. బిఎండబ్ల్యూ సెవెన్ సీరీస్ తో రెండు మూడు లగ్జరీ కార్లు ఆమెకు ఉన్నాయి. ఇతర ఎండార్స్మెంట్లు, ప్రమోషన్స్ ద్వారా మరికొంత ఆదాయం సంపాదిస్తోంది. ముంబై, చెన్నైలలో సమంతకు ఖరీదైన ఇల్లు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో కూడా షేర్స్ రూపంలో కూడా కొంత సొమ్ము ఇన్వెస్ట్ చేశారట. మొత్తంగా సమంత ఆస్తుల విలువ 97 కోట్లు అని అంటున్నారు. అంటే దాదాపు 100 కోట్లు అన్నమాట.
నాగచైతన్యతో వివాహం జరిగి ఆయనతో కలిసి ఉన్నప్పుడు కూడా సమంత తన సంపాదనను షేర్ చేయలేదట. చైతు ఆల్రెడీ పెద్ద కుటుంబానికి చెందినవాడు. తనకంటూ హీరోగా కోట్లలో సంపాదన ఉంది. దీంతో సమంత సంపాదనను ఆయన టచ్ చేయలేదని తెలుస్తోంది. విడాకుల తర్వాత సమంత భరణం తీసుకున్నారు అన్నది కూడా నిజం కాదంటున్నారు. ఆత్మవిశ్వాసం కలిగిన సమంత నాగచైతన్య పై కోపంతో ఒక్క రూపాయి కూడా ఆశించలేదట. చైతు- సమంతాలు ఇష్టపడి కొత్త ఇంటి నిర్మాణం చేపట్టారు. ఆ ఇంట్లోకి అడుగుపెట్టే లోపే విడిపోయారు. బహుశా ఇంటి నిర్మాణంలో సమంత కొంత ఖర్చు చేసి ఉండవచ్చు. ఆ పరంగా చూస్తే దీంట్లో కూడా ఆమెకు వాటా ఉంది. ఇక వివాహం జరిగిన తర్వాత కూడా సమంత పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహించి కొంత డబ్బును వాటికోసం కేటాయించింది. అది కూడా ఆమె సొంతంగా సంపాదించిన సంపాదనే అని టాలీవుడ్ పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి విడాకులు తర్వాత కూడా సమంతాకు 100 కోట్ల ఆస్తి ఉందంటే ఆర్థికంగా ఆమె మంచి స్థితిలో ఉన్నట్టే చెప్పుకోవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



