'సర్కారు వారి పాట' ఫస్ట్ నోటీస్ వచ్చేసింది.. బాబు ల్యాండ్ అయ్యాడు
on Jul 31, 2021
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సర్కారు వారి పాట'. తాజాగా మహేష్ అభిమానులకు మూవీ టీమ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఫస్ట్ నోటీస్ అంటూ పోస్టర్ ని విడుదల చేయడంతో పాటు.. మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించింది.
'సర్కారు వారి పాట' నుంచి మహేష్ ఫస్ట్ లుక్ ని శనివారం మూవీ టీమ్ విడుదల చేసింది. ఫస్ట్ నోటీస్ పేరుతో విడుదలైన ఈ పోస్టర్ లో మహేష్ లుక్ ఆకట్టుకుంటోంది. పొడవాటి జుట్టుతో మహేష్ చాలా స్టైల్ గా ఉన్నాడు. ఎరుపు రంగు కారులోని నుంచి మహేష్ స్టైల్ గా దిగుతున్నాడు. కారు అద్దాలు బద్దలై ఉండటం.. కారు వెనుక బైక్ లపై రేసర్లు ఉండటం చూస్తుంటే.. ఇదొక యాక్షన్ సన్నివేశంలో స్టిల్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహేష్ లుక్ తో పాటు మూవీ విడుదల తేదీని కూడా ప్రకటించారు మేకర్స్. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని 2022, జనవరి 13న విడుదల చేయబోతున్నట్లుగా తెలియజేశారు. బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
