7 నెలల గ్యాప్లో ప్రభాస్ 3 చిత్రాలు?
on Jul 31, 2021
కెరీర్ ఆరంభంలో ఏడాదికి రెండేసి సినిమాలతో సందడి చేస్తూ వచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. క్రమంగా సంవత్సరానికో సినిమాతో సరిపెడుతూ వచ్చారు. కట్ చేస్తే.. `బాహుబలి` సిరీస్ నుంచి ఆ లెక్క కూడా మారింది. రెండేళ్ళకో సినిమా అన్నట్లుగా `డార్లింగ్` ఫిల్మోగ్రఫీ తయారయ్యింది. ఈ సారైతే కరోనా ఎఫెక్ట్ కూడా తోడయ్యి `సాహో` తరువాత గ్యాప్ మరింత పెరిగింది. ఎన్నడూ లేని విధంగా రెండు క్యాలెండర్ ఇయర్స్ ప్రభాస్ కి జీరో రిలీజ్ ఇయర్స్ గా నిలిచాయి. 2021 ద్వితీయార్ధంలో రావాల్సిన `రాధే శ్యామ్` కాస్త 2022 సంక్రాంతికి వాయిదా పడింది.
దీంతో.. తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ 7 నెలల వ్యవధిలో 3 సినిమాలతో ఎంటర్టైన్ చేసే దిశగా ప్రభాస్ అడుగులు వేస్తున్నట్లయ్యింది. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న పిరియడ్ రొమాంటిక్ సాగా `రాధే శ్యామ్` రానుండగా.. 2022 వేసవి కానుకగా ఏప్రిల్ 14న యాక్షన్ సాగా `సలార్` రిలీజ్ కానుంది. ఇక అదే సంవత్సరం ఆగస్టు 11న మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్` థియేటర్స్ లో సందడి చేయనుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. సో.. అన్నీ అనుకూలిస్తే కేవలం 7 నెలల కాలంలో ముచ్చటగా మూడు చిత్రాలతో ప్రభాస్ పలకరించే అవకాశముందన్నమాట. అది కూడా.. పాన్ ఇండియా ప్రాజెక్టులతో.
ఒకవేళ అదే గనుక జరిగితే.. ప్రభాస్ అభిమానులకు ఇది కనువిందైన అంశమే. చూద్దాం.. ఏం జరుగుతుందో?
Also Read