"నేను చనిపోలేదు.. చాలా ఆరోగ్యంగా ఉన్నాను".. వీడియో రిలీజ్ చేసిన షకీలా!
on Jul 31, 2021
శృంగార చిత్రాల తార షకీలా చనిపోయారంటూ వదంతులు వచ్చాయి. ప్రస్తుతం సినిమాల కంటే టీవీ షోలకు షకీలా ప్రాధాన్యం ఇస్తున్నారు. తన గురించి, తన ఆరోగ్యం గురించి బయటకు వచ్చిన వదంతులకు షకీలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను ఆరోగ్యంగా ఉన్నానంటూ ఓ వీడియో విడుదల చేశారు. అంతేకాదు, తన గురించి విషాదవార్తను ప్రచారం చేసిన వ్యక్తికి కూడా ఆమె థాంక్స్ చెప్పారు.
అందరికీ నమస్కారం. నేను చనిపోయానంటూ వార్తలు వచ్చాయని విన్నాను. చూశారుగా, నన్ను. నేను చాలా ఆరోగ్యంగా, చాలా సంతోషంగా ఉన్నాను. నిజంగా బిగ్ స్మైల్తో ఉన్నాను. కేరళ నాపై చూపించిన శ్రద్ధకు థాంక్స్. చాలా సంతోషం. ఎవరో నా గురించి చెడు వార్త లేదా విషాద వార్తను ఇచ్చారు. కానీ దానివల్ల నాకు చాలా కాల్స్ వచ్చాయి. చాలామంది నాపై ప్రేమను కురిపించారు. మీ ప్రేమకు చాలా థాంక్స్. నాపై చెడువార్తను ఇచ్చిన వ్యక్తికి కూడా థాంక్స్. ఎందుకంటే దానివల్ల మరోసారి మీరు నావైపు చూశారుగా. అని ఆమె ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.
మిలా అనే యువతిని షకీలా దత్తత తీసుకున్నారు. ఆమెతో తీసుకున్న ఫొటోలను మీడియాకు రిలీజ్ చేశారు. ఇప్పుడు తన జీవితం మిలాయేననీ, ఆమె లేకపోతే తను లేననీ అన్నారు.
Also Read