ఐదు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో 'సర్దార్' బ్రేక్ ఈవెన్!
on Oct 26, 2022

ఈ దీపావళికి నాలుగు సినిమాలు విడుదల కాగా అందులో 'సర్దార్', 'ఓరి దేవుడా' చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. 'సర్దార్' తమిళ్ డబ్బింగ్ సినిమా అయినప్పటికీ హీరో కార్తికి తెలుగులో మంచి గుర్తింపు ఉండటం, అన్నపూర్ణ స్టూడియోస్ ఎక్కువ సంఖ్యలో థియేటర్స్ లో విడుదల చేయడంతో.. 'ఓరి దేవుడా'ని మించిన కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అంతేకాదు 'సర్దార్' చిత్రం తెలుగులో ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం.
తెలుగు రాష్ట్రాల్లో 'సర్దార్' బిజినెస్ వాల్యూ రూ.5 కోట్లని ట్రేడ్ వర్గాల అంచనా. పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు దీపావళి, లాంగ్ వీకెండ్ కావడంతో ఐదు రోజుల్లోనే ఈ చిత్రం తెలుగులో బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకుంది. మొదటి రోజు రూ.95 లక్షల షేర్, రెండో రోజు రూ.1.05 కోట్ల షేర్, మూడో రోజు రూ.1.48 కోట్ల షేర్, నాలుగో రోజు రూ.1.32 కోట్ల షేర్, ఐదో రోజు రూ.64 లక్షల షేర్ రాబట్టిన ఈ మూవీ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి ఐదు రోజుల్లో రూ.5.44 కోట్ల షేర్(9.05 కోట్ల గ్రాస్)తో సత్తా చాటింది. ఈరోజు నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి వచ్చే కలెక్షన్స్ ప్రాఫిట్స్ అని చెప్పొచ్చు. ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాల విడుదల లేకపోవడం 'సర్దార్'కి కలిసొచ్చే అంశం. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మరో రూ.3 కోట్ల దాకా షేర్ రాబట్టే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 'సర్దార్' ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.60 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు సమాచారం. అంతేకాదు ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతుందని ఇప్పటికే ప్రకటించారు.
ఇక 'ఓరి దేవుడా' విషయానికొస్తే ఈ చిత్రం ఐదు రోజుల్లో తెలుగు స్టేట్స్ లో రూ.3.59 కోట్ల షేర్(రూ.6.15 కోట్ల గ్రాస్) రాబట్టగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.4.25 కోట్ల షేర్(రూ.7.60 కోట్ల గ్రాస్) రాబట్టిందని అంచనా. వరల్డ్ వైడ్ గా రూ.5.5 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే ఇంకా కనీసం కోటిన్నర షేర్ రాబట్టాల్సి ఉంది. ఈ వీకెండ్ కి ఈ మూవీ కూడా బ్రేక్ ఈవెన్ సాధించే ఛాన్స్ ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



