ప్రభాస్ కు హెల్ప్ చేసిన సర్దార్ విలన్..!
on Apr 3, 2016

సర్దార్ విలన్ గుర్తున్నాడా..? ట్రైలర్ చాలా సార్లు చూసిన వాళ్లందరికీ ఈ పాటికే అతని ఫేస్ నోట్ అయిపోయి ఉంటుంది. తాను కూడా పవన్ కు వీరాభిమానిని అంటున్న ఈ విలన్ పేరు శరద్ ఖేల్కర్. హిందీలో సీరియల్స్ తో పాటు, కొన్ని సినిమాలు కూడా చేసినా ఇతనికి బ్రేక్ రాలేదు. కానీ ప్రభాస్ కు చేసిన ఒక సాయం, లైఫ్ ను టర్న్ చేసింది. బాహుబలి హిందీలో కూడా రిలీజైన విషయం మీకు తెలుసు కదా..మరి హిందీలో ప్రభాస్ కు వాయిస్ ఎవరు చెప్పి ఉంటారబ్బా అని డౌట్ రాలేదా..? ఒక వేళ ఆ డౌట్ వస్తే, దానికి జవాబు శరద్ ఖేల్కర్. ఇతని గొంతును సీరియల్స్ లో విన్న హిందీ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, బాహుబలి హిందీ వెర్షన్లో ప్రభాస్ కు డబ్బింగ్ చెప్పమని అడిగారట. వెంటనే ఎగిరి గంతేసి మరీ శరద్ సై అన్నాడు. ఆ డబ్బింగ్ తర్వాతే టాలీవుడ్ దృష్టిలో పడ్డాడు. సర్దార్ లో విలన్ పాత్రకు కొత్త ముఖాన్ని వెతుకుతున్న బాబీ అండ్ కో, వెంటనే శరద్ ను సినిమాలో విలన్ గా ఫిక్స్ చేసేశారు. ఇప్పటికే ట్రైలర్లో మనోడి విశ్వరూపం చూపించాడు. సర్దార్ తో తనకు బ్రేక్ రావాలని, అన్ని భాషల్లోనూ బిజీ అయిపోవాలని కోరుకుంటున్నాడీ హిందీ బాహుబలి. సర్దార్ లో పెర్ఫామెన్స్ ఎలా ఇచ్చాడో తెలియాలంటే మాత్రం, ఏప్రిల్ 8 వరకూ వెయిట్ చేయాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



