క్రైస్తవ ప్రపంచానికి హృతిక్ క్షమాపణలు
on Apr 4, 2016

క్రైస్తవ ప్రపంచానికి బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ క్షమాపణలు చెప్పారు. కొద్ది రోజుల క్రితం మాజీ ప్రేయసి కంగనా రనౌత్‌కు , హృతిక్ రోషన్‌కి మధ్య సోషల్ మీడియా సాక్షిగా మాటల యుద్ధం నడిచింది. ఈ సందర్భంలో కంగనా హృతిక్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో ఆమె ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ క్రైస్తవులు దైవంలా భావించే పోప్ పట్ల వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. "మీడియా పేర్కొంటున్న అందమైన మహిళల కన్నా నాకు పోప్‌తో ఎఫైర్ కలిగి ఉండే అవకాశాలే ఎక్కువ" అంటూ వ్యాఖ్యానించారు.
దీనిపై క్రైస్తవ సమాజం మండిపడింది. తమ మతాధిపతిని అవమానించడం ద్వారా క్రైస్తవుల మనోభావాలను, విశ్వాసాలను దెబ్బతీశారంటూ ఇండియన్ క్రిస్టియన్ వాయిస్ అధ్యక్షుడు అబ్రహం మథాయ్ సెక్షన్ 295ఏ కింద హృతిక్‌కు నోటీసులు పంపారు. పోప్‌కు రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. తన జీవిత భాగస్వామిగా ఎవరినైనా ఎంచుకునే హక్కు హృతిక్‌కు ఉందని కానీ ఇలా పోప్ పేరుని వాడుకొని మతాన్ని కించపరుస్తున్నట్లు మాట్లాడితే సహించబోమన్నారు. దీనిపై స్పందించిన హృతిక్ తాను పోప్‌పై చేసిన వ్యాఖ్యలు ఉద్ధేశ్యపూర్వకంగా చేసినవి కావన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



