పోలీసోడు ఆడియో రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది..!
on Apr 3, 2016
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తేరీ, తెలుగులో భారీ రిలీజ్ కోసం సిద్ధమవుతోంది. గోల్డెన్ హ్యాండ్ గా పేరున్న దిల్ రాజు ఈ సినిమా తెలుగు బాధ్యతలు తీసుకున్నారు. పోలీసోడు అనే టైటిల్ ను డిసైడ్ చేయడం నుంచి, తెలుగులో ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం వరకూ, అన్నింటా దిల్ రాజు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికెట్ సంపాదించుకుంది విజయ్ పోలీసోడు. ఆడియో ఫంక్షన్ కూడా నిర్వహించి పాటల విడుదలను భారీ ఎత్తున్న నిర్వహించాలనేది దిల్ రాజు ఆలోచన. ఆడియోకు ఎన్టీఆర్ ను చీఫ్ గెస్ట్ గా పిలవబోతున్నారని ఫిల్మ్ వర్గాల సమాచారం. అందుకు ఏప్రిల్ 6 వ తేదీని సరైన రోజుగా దిల్ రాజు ఫిక్స్ చేశారట. రాజారాణి తీసిన అట్లీ, తేరీని తెరకెక్కించాడు. విజయ్ సరసన సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. ప్రముఖనటి, మాజీ హీరోయిన్ మీనా కూతురిది ఈ సినిమాలో కీలక పాత్ర. తేరీ మూవీ, మ్యూజిక్ డైరెక్టర్ జివిప్రకాష్ సంగీతం అందించిన యాభైవ మూవీ కావడం విశేషం.