తన సినిమాలో సల్మాన్ లేకుండా చేసిన ఐశ్వర్య..!
on Apr 22, 2016

రణ్ దీప్ హుడా, ఐశ్వర్యారాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా సరబ్ జిత్. ఏళ్లకేళ్లు పాకిస్థాన్ జైళ్లలో మగ్గిపోయిన ఒక భారతీయ రైతు కథ ఇది. సరబ్ జిత్ కోసం అతని సోదరి దల్బీర్ కౌర్ కాళ్లరిగేలా తిరిగింది, గుండెలవిసేలా రోదించింది, తానేం చేయాలో అన్నీ చేసింది. అలాంటి దల్బీర్ పాత్రలో ఐశ్వర్య నటిస్తోంది. కాగా, దబాంగ్ 2 సినిమా షూటింగ్ టైంలో దల్బీర్ కౌర్ సల్మాన్ ఖాన్ ను కలిసింది. పాక్ లో సల్మాన్ కు భారీ ఫాలోయింగ్ ఉంది. అందువల్ల సల్లూభాయ్ తనకు సాయం చేయాలని, తన సోదరుడ్ని విడిపించాలని కోరింది. సల్మాన్ కూడా ఈ విషయంలో తానెంతవరకూ సాయం చేయగలిగితే అంత చేస్తానని మాటిచ్చాడు. సరబ్ జిత్, దల్బీర్ కౌర్ ల బయో పిక్ కాబట్టి, ఆమె పడిన ఆవేదన, స్టార్ హీరోను కలవడానికి ఆమె పడిన తిప్పలు కూడా సినిమాలో తీయాలి. కానీ సరబ్ జిత్ లో ఈ పార్ట్ లేదంటున్నాయి మూవీ వర్గాలు. కావాలనే ఐశ్వర్య ఈ సీన్స్ కు ఒప్పుకోకపోలేదట. ఆ కారణంగానే, దల్బీర్ లైఫ్ లో కీలకమైన ఈ సీన్ ను తెరకెక్కించడం కుదర్లేదట. గతంలో ఐష్, సల్మాన్ ప్రేమ వ్యవహారం నడపడం, ఆమె వదిలేసిన తర్వాత సల్మాన్ పిచ్చివాడిలా మారిపోవడం లాంటి సంఘటలు ఎన్ని జరిగాయో తెలిసిందే. అందుకే ఐష్ కు మళ్లీ ఆ రోజుల్ని గుర్తు చేసుకోవడం ఇష్టం లేదట. కాగా, మే 20 న రిలీజ్ కు సిద్ధమవుతోంది సరబ్ జిత్ మూవీ. సినిమా ట్రైలర్ కు అంతటా పాజిటివ్ రెస్పాన్స్ రావడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



