నిర్మాత అవుతున్న గబ్బర్ సింగ్ డైరెక్టర్..!
on Apr 22, 2016

గబ్బర్ సింగ్ తో స్టార్ డైరెక్టర్ల సరసన చేరిపోయాడు హరీష్ శంకర్. కెరీర్ అఅంతా లేస్తూ పడుతూ ఉన్న హరీష్ కు రామయ్యా వస్తావయ్యా షాక్ ఇస్తే, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కాస్త రిలీఫ్ ఇచ్చింది. సినిమాకు హిట్ టాక్ వచ్చినా, ఆ తర్వాత మాత్రం హరీష్ సినిమాలేవీ ట్రాక్ లో లేవు. పవన్ లాంటి స్టార్ తో చేసిన తర్వాత మళ్లీ చిన్న హీరోలతో సినిమా ఎందుకనుకున్నాడో ఏమో గానీ, డైరెక్షన్ పరంగా ఏ సినిమా కమిట్ అవలేదు. కానీ నిర్మాతగా మాత్రం మారాలనుకుంటున్నాడు. వర్మ, మారుతి, పూరీ జగన్ లాంటి వాళ్లందరూ తమ సినిమాలు చేసుకుంటూనే నిర్మాతలుగా కాస్త చిన్న సినిమాలని తీసి లాభాలు జేబులో వేసుకుంటున్నారు. ఇప్పుడు హరీష్ కూడా వాళ్ల దారిలోనే వెళ్లాలని డిసైడ్ అయ్యాడట. నెక్స్ట్ చిరు 151 చేద్దామని ప్లాన్ వేస్తున్న హరీష్, ఈ లోపు బన్నీతో కూడా ఒక సినిమా లాగించేయాలనుకుంటున్నాడు. ప్రస్తుతానికైతే ఖాళీగా ఉండకుండా, టాలెంటెడ్ డైరెక్టర్లతో చిన్న సినిమాలు తీసి హిట్లు కొట్టే పని పెట్టుకున్నాడట హరీష్ శంకర్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



