రామ్ చరణ్ సినిమాలో ఎన్నారై మోడల్..!
on Apr 22, 2016

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తనీ ఒరువన్ ను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాతో చాలాకాలంగా తనకు అందకుండా ఊరిస్తున్న బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకోవాలని చరణ్ భావిస్తున్నాడు. సినిమాలోని విలన్ పాత్రకు ఒరిజినల్ లో చేసిన అరవింద్ స్వామినే తీసుకున్నారు. కథలో అరవింద్ స్వామికి భార్య ఉంటుంది. ఈ పాత్రది సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్. ఆ పాత్ర కోసం, ఎన్నారై మోడల్ ఫరా కరిమిని తీసుకున్నారని సమాచారం. బాలీవుడ్ లో తేరాసరూర్ సినిమాతో ఆరంగేట్రం చేసిన ఈ హాట్ మోడల్, తెలుగులో డైరెక్ట్ గా భారీ సినిమాతో పరిచయం కావడంతో తెగ హ్యాపీ ఫీలైపోతోంది. ఇప్పటికే ఈమె పార్ట్ ఉండే షూటింగ్ ను ప్రారంభించేశారు. ధృవ అనేది వర్కింగ్ టైటిల్ గా అనుకుంటున్న చరణ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా చేస్తుండగా, హిప్ హాప్ తమిజ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



