చిరు, బాలయ్యల మధ్య కోల్డ్ వార్ ముగియలేదా?
on Jan 11, 2023

ఈ సంక్రాంతికి చిరు నటించిన వాల్తేరు వీరయ్య, బాలయ్య నటించిన వీరసింహారెడ్డిలు విడుదల అవుతున్నాయి. దాంతో ఇరు హీరోల అభిమానులు సందడి చేస్తున్నారు. ఒకప్పటిలా వారు ఒకరిపై ఒకరు మండిపడటం లేదు. విభేదాలను మరిచి తమ హీరోలకు థియేటర్ల కేటాయింపులో జరిగిన అన్యాయంపై దిల్ రాజు పై మండిపడి చివరకు వారసుడు వాయిదా వేసేలా చేశారు. కానీ చిరు, బాలయ్యల మధ్య కోల్డ్ వార్ ముగిసిందని అనుకోవడానికి లేదని కొందరంటున్నారు. దానికి ఉదాహరణగా వారు కొన్ని విషయాలను ప్రస్తావిస్తున్నారు. వాస్తవానికి వీరసింహారెడ్డిని డిసెంబర్ లోనే విడుదల చేయాలనుకున్నారట. ఈసారి కూడా వీరసింహారెడ్డిని ఇటీవల ముగిసిన డిసెంబర్లో విడుదల చేయాలని భావించినప్పటికీ బాలయ్య ఒత్తిడి వల్లనే ఈ చిత్రం సంక్రాంతికి పోస్టుపోనైంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.
చిరు సంక్రాంతికి వస్తుండడంతో తన సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయాలని తద్వారా చిరుతో పోటీ పడాలని బాలయ్య భావించాడని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. మరోవైపు వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల ఆరో తారీఖున ఒంగోలులో జరిగింది. అంత దూరం శృతిహాసన్ ఎన్నో వ్యయ ప్రయాసలు పడి మరి అక్కడ వేడుకలో పాల్గొని తనదైన స్పీచ్ తో అలరించింది. మరి అంత దూరం వెళ్లిన ఆమె హైదరాబాదులో ఉన్నప్పటికీ వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాత్రం హాజరు కాలేదు. దానికి కారణం జ్వరమని అంటున్నారు. కానీ బాలయ్య ఒత్తిడి మేరకే శృతి వాల్తేరు వీరయ్యకు హ్యాండిచ్చిందంటున్నారు. కానీ వాల్తేరు వీరయ్య కు డుమ్మా కొట్టేసిన శృతిహాసన్ తాజాగా అన్ స్టాపబుల్ షో కి మాత్రం ముఖ్యఅతిథిగా పాల్గొంది. దాంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది. మరోవైపు చిరంజీవి వాల్తేరు వీరయ్య వేడుకలో బాలయ్య నటించిన వీర సింహారెడ్డి కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కానీ బాలకృష్ణ మాత్రం తన వీరసింహారెడ్డి వేడుకలో వాల్తేరు వీరయ్య గురించి అసలు ప్రస్తావనే తేలేదు. దాంతో చిరు-బాలయ్యల మధ్య కోల్డ్‌వార్ ఇంకా అలాగే ఉందని కొందరు అంటున్నారు.
ఇక చిరంజీవి సరదాగా వాల్తేరు వీరయ్య వేదికపై శృతిహాసన్ ఒంగోలులో ఏమి తిన్నదో ?ఎవరు బెదిరించారో? తెలియదు ఈ ఫంక్షన్ కి రాలేకపోయింది అని సరదాగా అన్నారు. కానీ దీని వెనుక చాలా అంతరార్థం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు...!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



