బ్రహ్మోత్సవం ప్రచారానికి ఇంకా ముహూర్తం ఉందా..?
on May 13, 2016

పెద్ద సినిమా చిన్న సినిమా అనే తేడా లేకుండా పబ్లిసిటీ చేస్తే ఎలాంటి సినిమా అయినా భారీ విజయాన్ని సాధిస్తుంది. స్టార్స్ ఉన్న సినిమా అయినా పబ్లిసిటీ లేకపోతే బోల్తా కొట్టిన సందర్భాలున్నాయి. సినిమాలో ప్రతీ ఒక్కరూ పబ్లిసిటీ కోసం తమకు అందుబాటులో ఉన్న మాధ్యమాల్ని ఉపయోగించుకుని ప్రచారాన్ని ఊదరగొడితే, యావరేజ్ సినిమా కూడా హిట్టు సినిమాగా మారిపోతుంటుంది. అయితే కథలో విషయం లేని ఫ్లాప్ సినిమాల్ని ఏం చేసినా హిట్ చేయలేమనుకోండి..అది వేరే విషయం.
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సినిమా బ్రహ్మోత్సవం విషయానికొస్తే, వచ్చే వారమే సినిమా రిలీజ్. ఈ పాటికే సినిమాకు సంబంధించి ప్రమోషన్ల జోరు మొదలవ్వాలి. కానీ సమంత ట్విట్టర్లో తప్ప ఇంకెవరూ బ్రహ్మోత్సవం ప్రస్తావన కూడా తీసుకురావట్లేదు. పివిపి లాంటి ప్రొడ్యూసర్ తీస్తున్న సినిమా, అది కూడా భారీ బడ్జెట్. మరి సినిమాకు ప్రమోషన్లు ఏ రేంజ్ లో ఇస్తారో ఆలోచించక్కర్లేదు. కానీ అలాంటివేవీ ఈ సినిమాకు కనబడట్లేదు. శ్రీమంతుడు లాంటి భారీ హిట్ తర్వాత సూపర్ స్టార్ చేస్తున్న సినిమా. పై పెచ్చు హాట్ సమ్మర్, కూల్ ఎంటర్టైనర్ అని ట్యాగ్ కూడా తగిలించారు. ప్రస్తుతానికి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుంటోంది. బ్యాగ్రౌండ్ స్కోర్ నుంచి మణిశర్మ తప్పుకోవడంతో, ఊపిరి ఫేం గోపీ సుందర్ కు ఆ బాధ్యలు అప్పగించారు మూవీ టీం. మరి ఈరోజు, రేపట్లోనైనా మూవీకి ప్రమోషనల్ వర్క్ మొదలెడతారేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



