మామ నాగ్‌కు కోడలు సామ్ బర్త్‌డే విషెస్
on Aug 29, 2020

నాగచైతన్యను పెళ్లాడి అక్కినేని ఫ్యామిలీ మెంబర్ అయిపోయిన స్టార్ హీరోయిన్ సమంత, ఆ కుటుంబంలోని సభ్యులందరితోనూ చక్కని అనుబంధం ఏర్పరచుకుంది. మామయ్య నాగార్జునతో ఆమె అనుబందం మరింత ప్రత్యేకం. ఆ ఇద్దరూ కలిసి 'మనం', 'రాజుగారి గది 2' చిత్రాలు చేశారు. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండే ఆమె, మామతో కలిసి ఉన్నప్పటి పిక్చర్లను షేర్ చేసుకొనే అవకాశాన్ని ఏమాత్రం విడిచి పెట్టదు.

నాగార్జున విసిరిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను యాక్సెప్ట్ చేసిన ఆమె ఆయనతో కలిసి మూడు మొక్కలను నాటింది. ఈ సందర్భంగా తీసిన పిక్చర్లను జూలై 11న తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. ఆ ఫొటోల ప్రకారం మొక్కలను నాటడంలో సమంతకు నాగ్ సాయపడుతున్నారు. “I've accepted #HaraHaiTohBharaHai #GreenindiaChallenge from Nag mama. I planted 3 saplings.” అని ఆ పిక్చర్లతో పాటు పోస్ట్ చేసింది సమంత.

ఆగస్ట్ 29 నాగార్జునకు 61 సంవత్సరాలు నిండాయి. ఈ సందర్భంగా మామకు కోడలు బర్త్‌డే విషెస్ తెలిపింది. త్వరలో రాబోతున్న నాగ్ ఫిల్మ్ వైల్డ్ డాగ్ పోస్టర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఆమె, ఆ సినిమాపై తన ఉద్వేగాన్ని వ్యక్తపరుస్తూ, “Can’t wait for this #hbdkingnagarjuna” అని రాస్తూ, అందులో హృదయం గుర్తును ఉంచింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



