కంగనను జైలుకు పంపాలనుకున్న డ్రగ్ ఎడిక్టెడ్ టాప్ స్టార్?
on Aug 29, 2020

భయమనేది లేకుండా తన మనసులో ఉన్న విషయాన్ని బహిర్గతం చేసే తారగా కంగనా రనౌత్ పేరు తెచ్చుకుంది. ఎన్నో ఇంటర్వ్యూల ద్వారా ఆ విషయాన్న మనం చూశాం. లేటెస్ట్‌గా రిపబ్లిక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ టాప్ స్టార్ గురించి సంచలనాత్మక విషయాలు వెల్లడించింది. ఒకప్పుడు తను రిలేషన్‌షిప్‌లో ఉన్న ఆ టాప్ స్టార్ మితిమీరి డ్రగ్స్ తీసుకోవడంతో హాస్పిటల్ పాలయ్యాడని తెలిపింది. తనకు కొన్ని డార్క్ సీక్రెట్స్ తెలియడం వల్ల అతని ఫ్యామిలీ తనను కటకటాల వెనక్కి పంపాలని కూడా చూసిందని ఆమె ఆరోపించింది.
ఒక పెద్ద పార్టీలో ఎల్ఎస్‌డీ, కొకైన్ లాంటి డ్రగ్స్, మత్తునిచ్చే పిల్స్ విచ్చలవిడిగా ఉపయోగించారనీ, ఆ రోజంతా వాటిని వాడుతూ వచ్చారనీ ఆమె గుర్తు చేసుకుంది. ఆ ఎఫైర్ వల్లే బాలీవుడ్ లాంటి బిగ్ వరల్డ్‌లోకి ప్రవేశించే యాక్సెస్ లభించిందనీ, దాన్ని ఉపయోగించుకొని వాళ్ల పెద్ద పార్టీలకు వెళ్లేదాన్ననీ కంగన చెప్పింది. తనను తాను సూపర్‌హీరోగా భావించుకొనే ఆ వ్యక్తి మితిమీరి డ్రగ్స్ తీసుకోవడంతో కోకిలాబెన్ హాస్పిటల్‌లో చేర్పించాల్సి వచ్చిందంటూ సంచలనాత్మక విషయాన్ని ఆమె వెల్లడించింది. అయితే ఆ విషయం బయటకు పొక్కకుండా చూశారని ఆమె చెప్పింది.
ఆ స్టార్‌కూ, అతని భార్యకూ మధ్య వ్యక్తిగత విభేదాలొచ్చి, విడాకులు తీసుకున్నారనీ తెలిపిన కంగన, ఆ ఇద్దరూ తనను జైలులోకి నెట్టాలని చూశారని ఆరోపించింది. విడాకులు తీసుకున్నప్పటికీ, ప్రస్తుతం కలిసే ఉంటున్నారనీ, డబ్బు కోసమా, వేరే ఇంకేదైనా కారణమా అనేది వాళ్లు మాత్రమే చెప్పగలరని తెలిపింది కంగన. వాళ్లు అత్యంత శక్తిమంతులైనప్పుడు తానెలా వాళ్లకు హాని చెయ్యగలనని ఆమె ప్రశ్నించింది. "వాళ్లు నన్నెందుకు కటకటాల వెనక్కి నెట్టాలనుకున్నారు? ఈ రహస్యాలన్నీ నాకు తెలుసని వాళ్లకు తెలుసు కాబట్టి నన్ను కించపరచడానికి ప్రయత్నించారు. నన్ను రెండు నాలుకల దానిలా చిత్రీకరించారు, లేదా నన్ను చంపడానికి చూశారు" అని ఆమె ఆరోపించింది.
కంగన చెప్పిన విషయాలను బట్టి పేరు ప్రస్తావించకపోయినా హృతిక్ రోషన్‌ను ఆమె టార్గెట్ చేసుకున్నట్లు స్పష్టంగా తెలిసిపోతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



