నాగచైతన్య 20వ సినిమా 'థాంక్ యూ'
on Aug 29, 2020

నాగచైతన్య హీరోగా నటించే 20వ సినిమా ఖరారయ్యింది. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసే ఆ సినిమా టైటిల్ 'థాంక్ యూ'. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించనున్నారు. ఆగస్ట్ 29 నాగార్జున పుట్టినరోజును పురస్కరించుకొని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా నాగచైతన్య ఈ ప్రాజెక్టును ప్రకటించాడు. 'మనం' తర్వాత చైతన్య, విక్రమ్ కుమార్ కలిసి పనిచేయనున్న సినిమా ఇదే. ఈ మూవీకి బీవీఎస్ రవి స్క్రిప్ట్ అందిస్తున్నాడు. అందిన సమాచారం ప్రకారం ఇదొక రొమాంటిక్ డ్రామా.
"ఒక వ్యక్తీకరణను మనం మరచిపోవచ్చు. కానీ 'థాంక్ యూ' అనే మాటను సరైన సమయంలో వాడితే, అది ఏ ఇతర వ్యక్తీకరణ కంటే కూడా ఎక్కువగా చెబుతుంది. నేను చెప్పడానికి ఎదురుచూస్తున్న స్టోరీ ఇది. విక్రమ్ కుమార్‌తో ఈ సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది" అని ట్వీట్ చేశాడు చైతన్య.
చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో 'లవ్ స్టోరి' మూవీ చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన పనులు పూర్తి కాగానే 'థాంక్ యూ'ను అతను మొదలు పెట్టనున్నాడు. నిజానికి ఇదివరకే డైరెక్టర్స్ నందినీరెడ్డి, ఇంద్రగంటి మోహనకృష్ణలతో పనిచేయడానికి చైతన్య అంగీకరించాడు. ఇప్పుడు వాళ్ల కంటే ముందుగా విక్రమ్ కుమార్‌తో పనిచేయాలని అతను నిర్ణయించుకున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



