సమంతను కోడలుగా చేసుకుంది అందుకేనా?
on Oct 10, 2017
బాలకృష్ణ అన్నట్టు... ‘యాదృశ్చికమో... కాకతాళీయమో’ కానీ.. కొన్ని కొన్ని వ్యవహారాలు అనుకోకుండా కలుస్తుంటాయ్. ఉదాహరణకు మన సమంత, చైతూ పెళ్లి. వీరి పెళ్లికీ.. బాలీవుడ్ లో జరిగిన మరో జంట పెళ్లికీ చాలా దగ్గర పోలిక కనిపిస్తుంది. ఇంతకీ ఆ జంట ఎవరు? అనేగా మీ అనుమానం.. ఇంకెవరూ ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్. ఇక ఈ రెండు జంటల పెళ్లిల్లలో పోలికల గురించి చెప్పుకుంటే...
1. ఇక్కడది అక్కినేని కుటుంబం.. అలాగే అక్కడిది కూడా అమితాబ్ కుటుంబం. రెండూ లెజెండ్రీ ఫ్యామిలీలే.
2. ఇక్కడ అక్కినేని వారబ్బాయ్ పెళ్లి కొడుకు. అక్కడ బచ్చన్ వారబ్బాయ్ పెళ్లి కొడుకు. రెండు ఫ్యామిలీసూ పెళ్లి కొడుకు తరఫునవే.
3. ఇక్కడ సమంత టాలీవుడ్ సూపర్ హీరోయిన్.. అక్కడ ఐశర్యరాయ్ బాలీవుడ్ సూపర్ హీరోయిన్.
4. ఇక్కడ చైతూ... సమంతతో పోల్చి చూస్తే... స్టార్ డమ్ లో కాస్త తక్కువ. అక్కడ అభిషేక్... ఐశర్యతో పోలిస్తే... స్టార్ డమ్ లో కాస్త తక్కవ.
5. ఇక్కడ చైతూ, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అక్కడ అభిషేక్, ఐశర్వ ప్రేమించే పెళ్లాడారు.
6. ఇక్కడ చైతూ తొలి విజయం ‘ఏమాయచేశావె’. హీరోయిన్ సమంత. అక్కడ అభిషేక్ తొలి విజయం ‘ధాయ్ అక్షర్ ప్రేమ్ కీ’. కథానాయిక ఐశ్వర్యరాయ్.
ఇవన్నీ గమనించే నాగార్జున... సమంతను తన కోడల్ని చేసుకున్నాడా? అనే అనుమానం వస్తుంది. కానీ... అలాంటిదేం లేదులేండీ.. యాదృశ్చికంగా, కాకతాళీయంగా జరిగిన తంతు ఇది.
ఇవే కాదండీ.. ఇలా చూసుకుంటూ పోతే... ఇంకా చాలా పోలికలు కనిపిస్తాయ్. ఐశ్వర్య లాగా.. సమంత కూడా నటనను కొనసాగిస్తానని స్టేట్మెంట్ ఇచ్చేసింది. పెళ్లి అనంతరం... రాబోతున్న సమంత సినిమా ‘రాజుగారి గది 2’. ఇందులో మామగారు నాగార్జున హీరో కావడం విశేషం. సమంత రోల్ కూడా విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.
మరి కుమారుడిని సక్సెస్ ట్రాక్ లో నిలిపిన సమంత పాదం... మామగారి కూడా కలిసొస్తుందేమో చూడాలి. ఏది ఏమైనా.. చైతూ, సమంత జంట చూడ్డానికి కన్నుల పంటగా ఉందండీ. ఏమంటారు?