Home

»

Latest News

11వ రోజు 'సైరా', 'అల‌.. వైకుంఠ‌పుర‌ములో'ను మించిన 'అఖండ‌'!

Dec 13, 2021

 

నట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ 'అఖండ' రూపంలో బాక్సాఫీస్‌ను దున్నేస్తున్నారు. బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్ట్ చేయ‌గా డిసెంబ‌ర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన 'అఖండ' మూవీ తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో థియేట‌ర్ల ద‌గ్గ‌ర ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది. ఇప్ప‌టికే బాల‌య్య కెరీర్‌లో బిగ్గెస్ట్ గ్రాస‌ర్‌గా నిలిచిన ఈ సినిమా వ‌సూళ్లు రెండో వారంలోనూ ట్రేడ్ విశ్లేష‌కుల‌ను, ఇండ‌స్ట్రీని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. 11వ రోజు 'అఖండ' వ‌సూళ్లు 'అల‌.. వైకుంఠ‌పుర‌ములో', 'సైరా' వ‌సూళ్ల‌ను మించ‌డం విశేషం. 

Also read:  10 రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ సాధించిన 'అఖండ‌'!

రెండు తెలుగు రాష్ట్రాల్లో 11వ రోజు 'అఖండ' రూ. 3.05 కోట్ల షేర్‌ను వ‌సూలు చేసిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు తెలిపాయి. ఈ క్ర‌మంలో 'బాహుబ‌లి' సినిమాల‌ను ప‌క్క‌న‌పెడితే మ‌హేశ్‌ 'మ‌హ‌ర్షి' మూవీ త‌ర్వాత అత్య‌ధిక షేర్ సాధించిన సినిమాగా 'అఖండ' నిలిచింది. 'మ‌హ‌ర్షి'కి 11వ రోజు రూ. 3.22 కోట్ల షేర్ వ‌చ్చింది. అలాగే చిరంజీవి 'సైరా' 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.73 కోట్లను వ‌సూలు చేయ‌గా, అల్లు అర్జున్ 'అల‌.. వైకుంఠ‌పుర‌ములో' మూవీ రూ. 2.52 కోట్ల షేర్‌ను వ‌సూలు చేసింది. ఇప్పుడు 'సైరా', 'అల‌.. వైకుంఠ‌పుర‌ములో' సినిమాల 11వ రోజు క‌లెక్ష‌న్‌ను 'అఖండ' దాటేయ‌డం బాల‌య్య సినిమాల‌కు సంబంధించి పెద్ద ఎచీవ్‌మెంట్ అనే చెప్పాలి. 

Also read:  4 గంట‌లు బ్యాంకాక్‌ ఎయిర్‌పోర్ట్‌లో న‌ర‌క‌యాత‌న ప‌డ్డ‌ వ‌నిత‌.. ఎందుకో తెలుసా?

మొత్తంగా ఆంధ్ర‌ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో 'అఖండ' రూ. 50 కోట్ల షేర్ మార్క్‌ను దాటింది. 11 రోజుల‌కు 'అఖండ' రూ. 52.90 కోట్ల షేర్‌ను సాధించి, బాల‌య్య సినిమాల్లో స‌రికొత్త రికార్డును అందుకుంది. మ‌రో నాలుగు రోజుల పాటు 'అఖండ' ఆడియెన్స్‌ను భారీ సంఖ్య‌లో థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌నుంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com