'రానా నాయుడు' కోసం వెంకీ మామ కొత్త అవతారం!
on Dec 13, 2021

దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా కాంబినేషన్ లో మల్టీస్టారర్ కోసం ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఇద్దరు కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో దగ్గుబాటి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ‘రానా నాయుడు’ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. నేడు(డిసెంబర్ 13) వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సిరీస్ నుంచి ఆయన లుక్ ని రివీల్ చేశారు మేకర్స్.
Also Read: వెంకీ బర్త్ డేకి రిలీజైన ఏకైక చిత్రం!
తన తోటి సీనియర్ హీరోలు వరుస కమర్షియల్ సినిమాలతో అలరిస్తుంటే.. వెంకటేష్ మాత్రం వయస్సుకి తగ్గ పాత్రలు ఎంచుకుంటూ విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్నాడు. ఈ ఏడాది నారప్ప, దృశ్యం-2 వంటి చిత్రాలతో మెప్పించిన ఆయన.. త్వరలో ‘రానా నాయుడు’ సిరీస్ లో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఈ సిరీస్ నుంచి రిలీజైన వెంకీ లుక్ ఆకట్టుకుంటోంది. చేతిలో పాస్ పోర్ట్ సైజు ఫోటో పట్టుకొని సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో వెంకీ అదరగొడుతున్నాడు.
Also Read: విక్టరీ వెంకటేశ్ టాప్ 10 రీమేక్స్
వెంకీ మామ ప్రస్తుతం వరుణ్ తేజ్ తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'F3' సినిమా చేస్తున్నాడు. 'F2' కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



