సమంతకున్న భయాలేంటి? వాటిని దాటేసినట్టేనా?
on Mar 26, 2023
లైఫ్ లో పర్ఫెక్షన్ అనే మాటను ఇష్టపడటం లేదు సమంత. తన వల్ల అయినంత మేర ఏ పనినైనా చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికి తన మానసిక పరిస్థితి అదేనంటున్నారు సమంత. ఆమె నటించిన సినిమా శాకుంతలం వచ్చే నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా సుమకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు సమంత. ఆమె మాట్లాడుతూ "నా లైఫ్‌లో నేను మూడేళ్లుగా భయపడుతూ ఉన్నా. అయితే ఆ భయాన్ని దాటిన ప్రతిసారీ ఏదో సాధించగలుగుతున్నా. ఆ సాధించడం వెనుక అతీతమైన కష్టం ఉంటోంది. శ్రమను ఓర్చుకున్న ప్రతిసారీ వ్యక్తిగా పరిపక్వత సాధిస్తున్నట్టు అనిపిస్తోంది" అని అన్నారు.
చిన్నప్పటి నుంచీ డిస్నీ మూవీస్ చూసి పెరిగానని చెప్పారు సమంత. "నాకు డిస్నీ మూవీస్ అంటే ఇష్టం. వాటిలో కనిపించే జంతువులు, పక్షులు నాకు చాలా సరదాగా ఉంటాయి. శాకుంతలం మన కథ. ఈ సినిమాను నేను ఇండియన్ డిస్నీ మూవీ అని అంటాను" అని చెప్పారు.
శాకుంతలం సినిమాను మొదట ఒప్పుకోలేదట సమంత. దీనికి కారణం చెబుతూ "నేను శాకుంతలం సినిమాను మొదట అంగీకరించలేదు. అప్పుడే నేను ఫ్యామిలీమేన్ 2లో రాజీ కేరక్టర్ చేశాను. ఆ పాత్రకు, ఈ పాత్రకు ఫిజికల్‌గానే కాదు, మెంటల్‌గానూ చాలా మార్పు కావాల్సి వచ్చింది. నా చిన్నతనంలో నేను క్లాసికల్ ఆర్ట్స్ ఏవీ నేర్చుకోలేదు. అందుకే ఈ సినిమాలో నడకకు, పరిగెత్తడానికి కూడా నేను స్పెషల్ కోచింగ్ తీసుకున్నాను. దాదాపు మూడు వారాలు అవన్నీ నేర్చుకున్నా" అని అన్నారు. తనకు బరువులెత్తడం అలవాటే కాబట్టి, ఇందులో బంగారు నగలు ధరించడాన్ని బరువుగా ఫీల్ కాలేదని అన్నారు. సినిమా కథగా విన్నప్పటికీ, తెర మీద చూసుకున్నప్పటికీ చాలా సంతృప్తిగా అనిపించిందని అన్నారు.
యశోద సమయంలో ఒకే ఒక్క ఇంటర్వ్యూ తనను ప్రజల్లోకి తీసుకెళ్లిందని, ఆ సమయంలో మెడికేషన్‌లో ఉండటం వల్ల బయటకు రాలేకపోయానని చెప్పారు. ఇప్పుడు ఆరోగ్యపరంగా కోలుకున్నట్టు తెలిపారు సమంత.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
