రష్మిక బ్రేక్‌ఫాస్ట్ ఛాయిస్ ఇదే!
on Mar 25, 2023
నేషనల్ క్రష్ రష్మిక మందన్న బ్రేక్‌ఫాస్ట్ ఏం తింటారో తెలుసుకోవాలన్నది చాలా మంది కోరిక. వారందరి కోసమే తన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని రివీల్ చేశారు రష్మిక మందన్న. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫిట్టెస్ట్ యాక్ట్రెస్‌గా పేరుంది రష్మిక మందన్నకు. ఎలాంటి ప్రదేశంలో షూటింగ్ చేసినా, ఆమె వర్కవుట్స్ ని మాత్రం సీరియస్‌గా తీసుకుంటారు. హెల్దీగా, ఫిట్‌గా ఉంటే మ్యాజిక్స్ చేయొచ్చంటారు రష్మిక మందన్న. ఈ సందర్భంగా ఆమె తన ఫ్యాన్స్ కోసం హెల్దీ బ్రేక్ ఫాస్ట్ రెసిపీని షేర్ చేసుకున్నారు. ప్రొటీన్ రిచ్ ఓట్ ప్యాన్‌కేక్‌లు చేయడమంటే తనకు మహా సరదా అని అన్నారు రష్మిక. ఒక అరటిపండు, ఒక గుడ్డు, ఖర్జూరాలు, రెండు టీస్పూన్ల బాదంపాలు, పావు టీస్పూన్ బేకింగ్ పౌడర్, అర టీస్పూన్ దాల్చిన చక్క పొడి, మూడు టీ స్పూన్ల ఓట్స్, ఒక స్పూన్ చాక్లెట్ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, వెన్న ఉంటే చాలని అంటున్నారు రష్మిక.
వీటన్నిటినీ బ్లెండర్‌లో వేసి గట్టి పిండిగా చేసుకుని పెనం మీద అట్టులా వేసుకోవాలని, నెయ్యితో తింటే రుచి అదిరిపోతుందని అంటారు రష్మిక మందన్న. పుష్ప సీక్వెల్‌లో ఇల్లాలు శ్రీవల్లిగా మెప్పించడానికి రెడీ అవుతున్నారు రష్మిక. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ని వైజాగ్‌లో తెరకెక్కించారు. ఈ సినిమాతో పాటు హిట్ కాంబినేషన్‌లో మరో సినిమాలో నటిస్తున్నారు. ఆల్రెడీ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా భీష్మలో నటించారు రష్మిక. ఇప్పుడు ఇదే కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. ఈ సినిమాకు చిరంజీవి క్లాప్ కొట్టి ప్రారంభించారు. మెగాస్టార్ చేతుల మీదుగా తన తాజా సినిమా స్టార్ట్ కావడం అదృష్టమని అన్నారు రష్మిక మందన్న. ఈ సినిమాకు విఎన్ ఆర్ ట్రియో అని టెంటేటివ్‌గా పేరు పెట్టారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్‌గా జీవీ ప్రకాష్ సంగీతం అందించిన సార్ మూవీ సూపర్‌డూపర్ హిట్ అయింది. ఇప్పుడు అదే జోష్తో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు ప్రకాష్.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
