'ఉస్తాద్ భగత్ సింగ్'లో విలన్ గా మంత్రి మల్లారెడ్డి!
on Mar 26, 2023
'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం దర్శకుడు హరీష్ శంకర్, తెలంగాణ మంత్రి మల్లారెడ్డిని సంప్రదించడం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా మల్లారెడ్డే రివీల్ చేశారు.
కొంతకాలంగా మల్లారెడ్డి పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. "పాలు అమ్మినా.. పూలు అమ్మినా.. కష్టపడినా.. సక్సెస్ అయినా" అంటూ ఇలా ఆయన ఏ స్పీచ్ ఇచ్చినా అది వైరల్ అవుతోంది. ఈ క్రమంలో సినిమా వాళ్ళు సైతం ఆయన క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా 'మేం ఫేమస్' మూవీ టీజర్ లాంచ్ వేడుకలో పాల్గొన్న మల్లారెడ్డి.. 'ఉస్తాద్ భగత్ సింగ్'లో విలన్ రోల్ చేయమని ఆఫర్ వచ్చిందని చెప్పి సర్ ప్రైజ్ చేశారు. ఇటీవల దర్శకుడు హరీష్ శంకర్ తనని కలిసి 'ఉస్తాద్ భగత్ సింగ్'లో విలన్ గా నటించమని అడిగారని, కానీ తాను అంగీకరించలేదని మల్లారెడ్డి తెలిపారు. ఒకవేళ ఆయన అంగీకరించి ఉంటే పవన్-మల్లారెడ్డి కాంబో కొత్తగా క్రేజీగా ఉండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
