'శాకుంతలం'లో సమంత లుక్ వచ్చేసింది
on Feb 21, 2022
.webp)
సమంత ప్రధాన పాత్రధారిగా దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తోన్న పౌరాణిక చిత్రం 'శాకుంతలం'. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీలో శకుంతలగా సమంత నటించగా, దుష్యంతుని పాత్రను మలయాళం నటుడు దేవ్ మోహన్ పోషించాడు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సోమవారం ఈ సినిమాలో సమంత ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తెల్లటి దుస్తుల్లో మునికన్య శకుంతల రూపంలో సమంత ఆకట్టుకుంటోంది. ఒక రాతిపై కూర్చొని వున్న ఆమె చుట్టూ లేళ్లు, నెమళ్లు, కుందేళ్లు హంసలు లాంటి వన్య ప్రాణులు ఆడుకుంటూ కనిపిస్తున్నాయి. ఈ ఫస్ట్ లుక్‌ను తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసిన సమంత, "Nature’s beloved.. the Ethereal and Demure.. “Shakuntala” from #Shaakuntalam " అనే క్యాప్షన్ జోడించింది.
దుర్వాస మహర్షిగా మోహన్‌బాబు, మేనకగా మధుబాల నటించిన ఈ మూవీలో చిన్నారి భరతుని పాత్రలో అల్లు అర్హ తెరంగేట్రం చేస్తోంది. మణిశర్మ సంగీతం సమకూరుస్తోన్న ఈ మూవీని దిల్ రాజు సమర్పిస్తున్నారు. నీతా లుల్లా కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేసిన ఈ మూవీకి శేఖర్ వి. జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందించారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



