`ఇంద్ర` బాటలో `మెగా 156`!?
on Feb 21, 2022

మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్స్ లో `ఇంద్ర` (2002) ఒకటి. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ ఫ్యాక్షన్ డ్రామా.. తెలుగునాట సరికొత్త రికార్డులను సృష్టించింది. `అన్నయ్య` తరువాత సరైన విజయం లేని చిరుని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువచ్చింది. అయితే, ఆ తరువాత మళ్ళీ సీమ నేపథ్యంలో మెగాస్టార్ సినిమా చేయనేలేదు. త్వరలో ఆ ముచ్చట తీరనుందని సమాచారం.
Also read: బిగ్‌బాస్ ఓటీటీలోకి `నగ్నం` బ్యూటీ
ఆ వివరాల్లోకి వెళితే.. `ఛలో`, `భీష్మ` వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో టాలీవుడ్ దృష్టిని విశేషంగా ఆకర్షించిన యువ దర్శకుడు వెంకీ కుడుములతో చిరు ఓ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. `మెగా 156` అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. కాగా, ఈ చిత్రం రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో సాగనుందట. అంతేకాదు.. ఇందులో ఇన్ స్టాగ్రామ్ ఇన్ ఫ్లూయన్సర్ రోల్ లో చిరు దర్శనమిస్తారని బజ్. అలాగే, `ఇంద్ర`లా సీరియస్ సబ్జెక్ట్ గా కాకుండా వెంకీ కుడుముల మార్క్ ఎంటర్టైనర్ గా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని అంటున్నారు. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
ఇదిలా ఉంటే, ఈ సినిమాలో చిరుకి జోడీగా మాళవికా మోహనన్ నటించనుందని టాక్. 2023 ప్రథమార్ధంలో ఈ సినిమా తెరపైకి వచ్చే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



