పవన్ సినిమాలో సల్మాన్!?
on Jun 9, 2022

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ జట్టుకట్టనున్నారా? అవునన్నదే ఫిల్మ్ నగర్ బజ్.
ఆ వివరాల్లోకి వెళితే.. `గబ్బర్ సింగ్` (2012) వంటి సంచలన చిత్రం తరువాత పవన్ కళ్యాణ్ - దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్ లో `భవదీయుడు భగత్ సింగ్` పేరుతో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ బేనర్ మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించనున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించే అవకాశముందని సమాచారం. ఇదిలా ఉంటే, ఇదే చిత్రంలో సల్మాన్ ఖాన్ ఓ స్పెషల్ రోల్ లో కనిపిస్తారట. ఈ మేరకు సల్మాన్, హరీశ్ మధ్య ఇటీవల చర్చలు సాగాయని ఇన్ సైడ్ టాక్. త్వరలోనే `భవదీయుడు భగత్ సింగ్`లో సల్మాన్ ఖాన్ ఎంట్రీపై క్లారిటీ రానుంది.
కాగా, సల్మాన్ ఖాన్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి `గాడ్ ఫాదర్`లో స్పెషల్ రోల్ చేస్తున్నారు. అలాగే విక్టరీ వెంకటేశ్ తో కలిసి ఓ హిందీ చిత్రం చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



