నయన్, విఘ్నేశ్ ఫస్ట్ పెళ్లి ఫొటో వచ్చేసింది!
on Jun 9, 2022
.webp)
లేడీ సూపర్‌స్టార్ నయనతార, తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ఈరోజు మహాబలిపురంలోని షెరటాన్ పార్క్ హోటల్‌లో పెళ్లి చేసుకొని దంపతులుగా మారారు. 2015 నుంచి ప్రేమలో ఉన్న వారు ఇంతదాకా సహజీవనం చేస్తూ వచ్చారు. కుటుంబసభ్యులు, కొంతమంది సన్నిహితుల మధ్య తమిళ హిందూ సంప్రదాయం ప్రకారం నయన్ మెడలో మూడు ముళ్లు వేశాడు విఘ్నేశ్. ఆ పెళ్లికి సంబంధించిన తొలి ఫొటోను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అతను షేర్ చేశాడు.
ఆ ఫొటోలో పింక్ కలర్ శారీ, బ్లౌజ్‌లో చూడ్డానికి రెండు కళ్లూ చాలవన్నంత సౌందర్యంతో మెరిసిపోతోంది నయన్. ఒక చేత్తో ఆమె చేతిని, ఇంకో చేత్తో ఆమె తలను పట్టుకొని ఆమె నుదుటి పక్కన ముద్దాడుతున్నాడు విఘ్నేశ్. ఆ అపురూప క్షణాలను ఆస్వాదిస్తున్నట్లుగా నయన్ కళ్లు మూసుకుంది. అయినప్పటికీ ఆమె ముఖంలో అమితానందంతో కూడిన తేజస్సు విరాజిల్లుతోంది. ఇద్దరి మెడలోనూ దండలున్నాయి.
ఆ ఫొటోను షేర్ చేసిన విఘ్నేశ్, "On a scale of 10… She’s Nayan & am the One.. With God’s grace , the universe , all the blessings of our parents & best of friends.. Jus married #Nayanthara #WikkiNayan #wikkinayanwedding " అంటూ రాసుకొచ్చాడు.
ఈ వేడుకకు రజనీకాంత్, షారుక్ ఖాన్, అజిత్, మణిరత్నం, శరత్ కుమార్, రాధిక, కార్తీ, విజయ్ సేతుపతి తదితర స్టార్ సెలబ్రిటీస్ హాజరయ్యారు. త్వరలోనే నయన్, విఘ్నేశ్ వివాహ రిసెప్షన్ జరగనున్నది. దీనికి భారతీయ చిత్రసీమలోని పలువురు సెలబ్రిటీలు హాజరు కానున్నట్లు సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



