ఫ్లాప్స్ ఫ్లాప్సే.. పూజ లెక్క లెక్కే!?
on Jun 9, 2022
.webp)
జనరల్ గా వరుసగా మూడు ఫ్లాప్స్ పడితే ఏ హీరోయిన్ రెమ్యూనరేషన్ అయినా తగ్గాల్సిందే. అదేమి చిత్రమో గానీ.. బుట్టబొమ్మ పూజా హెగ్డే మాత్రం పారితోషికం తగ్గించేదేలే అంటూ టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అవుతోంది.
ఆ వివరాల్లోకి వెళితే.. 2022 క్యాలెండర్ ఇయర్ మిగతా స్టార్ బ్యూటీలకు ఎలా ఉన్నా.. పూజకి మాత్రం నిరాశజనకంగానే సాగుతోంది. ఎందుకంటే.. గత ఏడాది వరకు వరుస విజయాల్లో ఉన్న తనకి `రాధే శ్యామ్`, `బీస్ట్`, `ఆచార్య` రూపంలో తక్కువ వ్యవధిలోనే మూడు భారీ డిజాస్టర్స్ క్రెడిట్ అయ్యాయి. ఇక `ఎఫ్ 3`లో స్పెషల్ సాంగ్ చేసినా.. పెద్దంతగా ప్లస్ కాలేదు. అయినప్పటికీ తనకున్న క్రేజ్ వల్ల ఇప్పటికీ బడా ప్రాజెక్ట్స్ లో భాగమవుతూనే ఉంది పూజ. ఈ క్రమంలోనే.. రీసెంట్ గా `జన గణ మన` అనే పాన్ - ఇండియా వెంచర్ లో జాయిన్ అయింది మిస్ హెగ్డే. `లైగర్` తరువాత యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ - డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా కోసం అక్షరాలా రూ. 5 కోట్ల పారితోషికం పుచ్చుకుంటోందట పూజ. మొత్తమ్మీద.. ఫ్లాప్స్ ఫ్లాప్సే తన లెక్క లెక్కే అన్నట్లుగా పారితోషికం విషయంలో గట్టిగానే ఉంది పూజ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



