సలార్ ఫస్ట్ రివ్యూ.. సంక్రాంతి సినిమాలు కూడా సైడ్ అవ్వాల్సిందే!
on Dec 15, 2023

ఈ ఏడాది తెలుగు నుంచి రూ.500 కోట్లు కొల్లగొట్టిన సినిమా ఒక్కటి కూడా రాలేదు. అయితే ఆ లోటుని భర్తీ చేయడానికే అన్నట్టుగా 'సలార్' సినిమా వస్తోంది. ఈ సినిమా రూ.500 కోట్లు కాదు.. రూ.1000 కోట్లు కొల్లగొట్టడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ మూవీ అవుట్ పుట్ ఓ రేంజ్ లో ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
'సలార్'కి సెన్సార్ రిపోర్ట్ చాలా పాజిటివ్ గా ఉందట. చిత్ర సన్నిహిత వర్గాలు సైతం ఈ సినిమా గురించి మాములుగా చెప్పడంలేదు. 'కేజీఎఫ్'లో కథనం మీద ఎక్కువగా దృష్టి పెట్టిన ప్రశాంత్ నీల్.. సలార్ విషయంలో మాత్రం కథనంతో పాటు కథ మీద కూడా ఎక్కువ వర్క్ చేశాడట. 'కేజీఎఫ్'తో పోలిస్తే 'సలార్' కథ ఎంతో బలంగా ఉంటుందట. యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సన్నివేశాలు కూడా కట్టిపడేస్తాయట. ముఖ్యంగా ఈ సినిమాలోని ఫైట్లు యాక్షన్ ప్రియులకి పండగే అంటున్నారు. మొత్తం ఐదు ఫైట్లు ఉంటాయట. ఫస్టాఫ్ లో రెండు ఫైట్లు, సెకండాఫ్ లో మూడు ఫైట్లు ఉంటాయట. ఐదు ఫైట్లు కూడా ఒకదానిని మించి మరొకటి అన్నట్టుగా ఉన్నాయని టాక్. డిసెంబర్ 22న విడుదలవుతున్న ఈ సినిమా కనీసం మూడు నాలుగు వారాల పాటు థియేటర్లలో సందడి చేయడం ఖాయమని చెబుతున్నారు. అదే జరిగితే సంక్రాంతి సినిమాలపై ప్రభావం పడే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



