నా సామి రంగ లో ఉన్న ఆ హీరో గురించి చెప్పకపోతే మాటొచ్చేతది అంటున్న నాగార్జున
on Dec 15, 2023
.webp)
కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న ఊర మాస్ మూవీ నా సామిరంగ..సంక్రాంతి బరిలో దిగడానికి శరవేగంగా ముస్తాబవుతున్న ఈ మూవీ మీద నాగ్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అలాగే మూవీ ప్రారంభం అయినప్పటి నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ తో ముందుకు వెళ్తు నా సామి రంగ ఘన విజయం సాధించడం ఖాయమనే సంకేతాలని కూడా ఇచ్చింది. ఇప్పుడు అది పక్కాగా నిజమని మరో సారి నిరూపించేలా ఈ సినిమా మేకర్స్ ఒక హీరో ఇంట్రో వీడియోని పరిచయం చేసింది.
నా సామి రంగ లో నాగ్ తో పాటు అల్లరి నరేష్ కూడా తన హవాని చూపించబోతున్నాడు. ఈ మేరకు మేకర్స్ అల్లరి నరేష్ కి సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియోని రిలీజ్ చేసారు. మా అంజి గాడ్ని పరిచయం చేస్తున్నాం లేదంటే మాటొచ్చేతది అనే ఒక టైటిల్ ని కూడా నరేష్ ఇంట్రో కి ఇచ్చారంటే సినిమాలో నరేష్ క్యారక్టర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో తెలుస్తుంది. అలాగే ఆ వీడియోలో నాగార్జున నరేష్ ల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా సూపర్ గా ఉన్నాయి. సినిమాలో నాగ్ వీరవిహారం ఎలాగు ఉంటుంది కాబట్టి ఇప్పుడు అంజి క్యారక్టర్ లో అల్లరి నరేష్ వీరవిహారం కూడా ఖాయమని అర్ధం అవుతుంది.

నాగార్జున సినీ కెరీర్లోనే గుర్తుండిపోయేలా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నా సామి రంగ ని అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగ్ కి జతగా ఆషికా రంగనాద్ జోడికట్టనుంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి కథ లని అందించిన ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకి మాటలని అందిస్తున్నాడు. ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీత సారథ్యంలో నా సామి రంగ మరింతగా మెరుగులు దిద్దుకుంటుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



